Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న‌ 6 కార్లు

రేవంత్ రెడ్డి 4 కార్ల కాన్వాయ్, మీడియాకు చెందిన 2వాహనాలు వేగంగా వెళ్తుండటంతో కార్లన్నీ ఒకదానికొకటి గుద్దుకున్నాయి.

రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న‌ 6 కార్లు
X

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు రాజన్న సిరిసిల్లా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఓ సమావేశం కోసం రేవంత్ రెడ్డి 4 కార్ల కాన్వాయ్, మీడియాకు చెందిన 2వాహనాలు వేగంగా వెళ్తుండటంతో కార్లన్నీ ఒకదానికొకటి గుద్దుకున్నాయి. కార్లలోని ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవడంతో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. అయితే ఒక‌ వాహనంలో ఉన్న‌ పలువురు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు గాయాలైనట్టు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

First Published:  4 March 2023 6:53 AM GMT
Next Story