Telugu Global
Telangana

వాట్సప్ లో బూతు వీడియో.. తెలంగాణ కాంగ్రెస్ నేతకు షాక్

వినోద్ వదిలేయాలని చెప్పినా.. ఆయన సెల్ ఫోన్ నుంచి వచ్చిన వీడియో ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

వాట్సప్ లో బూతు వీడియో.. తెలంగాణ కాంగ్రెస్ నేతకు షాక్
X

మన సెల్ ఫోన్ నుంచి వాట్సప్ లో కి వెళ్లే సందేశాలకు, ఫొటోలకు పూర్తిగా మనదే బాధ్యత. అలాంటిది ఓ రాజకీయ నాయకుడి సెల్ ఫోన్ నుంచి వాట్సప్ గ్రూప్ లో ఏదయినా మెసేజ్ వచ్చిందంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే అది ఓ బూతు వీడియో. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది.

ఆ నాయకుడు మరెవరో కాదు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గడ్డం వినోద్. ఆయన ఫోన్ నుంచి మంచిర్యాల జిల్లా వాట్సప్ గ్రూప్ లో ఓ వీడియో షేర్ అయింది. అది బూతు వీడియో కావడంతో అందరూ షాకయ్యారు. అది కూడా గడ్డం వినోద్ పర్సనల్ నెంబర్ నుంచి రావడంతో వెంటనే ఫోన్ చేసి ఆయనకు సమాచారం ఇచ్చారు.

అబ్బెబ్బే.. అది నేను కాదు..

ఆ ఫోన్ నాదే, ఆ నెంబర్ నాదే, కానీ ఆ వీడియో పెట్టింది నేను కాదు అంటున్నారు గడ్డం వినోద్. తనకి రెండు ఫోన్లు ఉన్నాయని, ఒక నెంబర్ ఎప్పుడూ తన డ్రైవర్ దగ్గర ఉంటుందని. అతని పొరపాటు వల్ల ఆ వీడియో వాట్సప్ గ్రూప్ లో షేర్ అయిందని వివరణ ఇచ్చారు. డ్రైవర్ తప్పిదంతో జరిగిన దానికి తనను బాధ్యుడిని చేయడం సరికాదంటున్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని విజ్ఞప్తి చేశారు.

వినోద్ వదిలేయాలని చెప్పినా.. ఆయన సెల్ ఫోన్ నుంచి వచ్చిన వీడియో ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ పార్టీకి తలవొంపులు తెచ్చేలా ప్రవర్తించడమేంటని కాంగ్రెస్ నేతలు రుసరుసలాడుతున్నారు.


First Published:  6 Oct 2023 7:58 AM GMT
Next Story