Telugu Global
Telangana

కోరిక తీర్చాలంటూ వేధింపులు.. యువ‌కుడిని నరికి చంపిన యువతి

శ్రీనివాస్ నిత్యం సంగీత ఇంటికి వెళ్లి వేధిస్తున్నాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ బలవంత పెడుతున్నాడు. దీంతో యువతి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కోరిక తీర్చాలంటూ వేధింపులు.. యువ‌కుడిని నరికి చంపిన యువతి
X

లైంగికవాంఛ తీర్చాలంటూ నిత్యం వేధిస్తున్న ఓ యువకుడిని యువతి హత్య చేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటుచేసుకుంది. జాడి సంగీత అనే యువతికి తల్లిదండ్రులు చనిపోవడంతో ఏటూరు నాగారంలోని అమ్మమ్మ వద్ద ఉంటోంది. స్థానికంగా కూలి పనులు చేసుకుంటోంది. అయితే అదే కాలనీకి చెందిన రాంటెంకి శ్రీనివాస్ (25)కు వివాహమైంది. ప్రస్తుతం భార్యతో దూరంగా ఉంటున్నాడు.

కాగా, శ్రీనివాస్ నిత్యం సంగీత ఇంటికి వెళ్లి వేధిస్తున్నాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ బలవంత పెడుతున్నాడు. దీంతో యువతి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. జైలుకు కూడా పంపించారు.

ఇటీవల కారాగారం నుంచి విడుదలైన శ్రీనివాస్ మళ్లీ సంగీతను వేధించడం మొదలుపెట్టాడు. మరోసారి సంగీత ఇంటికి వెళ్లి బ‌ల‌వంతం చేయ‌బోయాడు. దీంతో ఆమె శ్రీనివాస్ ను కుర్చీలో కట్టేసి.. కత్తితో నరికి హత్య చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

First Published:  30 March 2023 12:59 PM GMT
Next Story