Telugu Global
Telangana

గ్యాస్‌ సిలిండర్లలో నీళ్లు.. ఏంటి భయ్యా ఇదీ..?

అనుమానం వచ్చి సిలిండ‌ర్‌ను వంచితే అందులో గ్యాస్‌కు బదులు నీళ్లు వచ్చాయి. అవాక్కయిన బాధితుడు వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ పట్టుకుని మొయినాబాద్‌లోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి బయల్దేరాడు.

గ్యాస్‌ సిలిండర్లలో నీళ్లు.. ఏంటి భయ్యా ఇదీ..?
X

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన పల్లె శేఖర్ అనే వ్యక్తి వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు. సిలిండర్ వచ్చింది. ఇంట్లోవాళ్లు వంట చేసేందుకు స్టవ్ వెలిగించారు. అయితే ఎంత ప్రయత్నించినా స్టవ్ వెలగడం లేదు. ఏమైందబ్బా.. అని సిలిండర్ ఊపి చూడగా నీళ్లు ఉన్న శబ్దం వచ్చింది. అనుమానం వచ్చి సిలిండ‌ర్‌ను వంచితే అందులో గ్యాస్‌కు బదులు నీళ్లు వచ్చాయి. అవాక్కయిన బాధితుడు వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ పట్టుకుని మొయినాబాద్‌లోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి బయల్దేరాడు.

ఏజెన్సీ వాళ్ల ముందే సిలిండర్‌ నుంచి నీళ్లు వస్తుండటాన్ని చూపించాడు. అయితే వాళ్లు తమకేం సంబంధం లేదని సర్దిచెప్పి మరో సిలిండర్ ఇచ్చి పంపించారు. ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వహకుల తీరుపై బాధితుడు శేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గ్యాస్‌ సరఫరా చేసేవాళ్లు వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపించాడు. తనకు జరిగిన మోసం ఎవరికీ జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

సరిగ్గా వారం కిందట వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కూడా ఇండేన్ గ్యాస్‌ ఏజెన్సీకి చెందిన సిలిండర్‌ నుంచే నీళ్లు వచ్చాయి. వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఆకుల సత్యం అనే స్థానికుడి ఇంట్లో ఈ ఘటన జరిగింది.

First Published:  4 Feb 2024 10:22 AM GMT
Next Story