Telugu Global
Telangana

సీఎం కేసీఆర్‌పై సరికొత్త పాట.. సోషల్ మీడియాలో అప్పుడే వైరల్

'ఉక్కు గుండెనొక్కసారన్న తాకాలని ఉన్నదే.. ఆ బక్కపల్చని పెయ్యిని హత్తుకోవాలని ఉన్నదే' అంటూ సాగే పాటను ఎంపీ సంతోశ్ కుమార్ బుధవారం విడుదల చేశారు.

సీఎం కేసీఆర్‌పై సరికొత్త పాట.. సోషల్ మీడియాలో అప్పుడే వైరల్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అనేక పాటలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని పార్టీలు ప్రత్యేక పాటలను రూపొందించి విడుదల చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన 'రామక్క' పాట పెను సంచలంగా మారింది. ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. తాజాగా సీఎం కేసీఆర్‌పై రిలీజైన కొత్త పాట మరోసారి తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటోంది.

'ఉక్కు గుండెనొక్కసారన్న తాకాలని ఉన్నదే.. ఆ బక్కపల్చని పెయ్యిని హత్తుకోవాలని ఉన్నదే' అంటూ సాగే పాటను ఎంపీ సంతోశ్ కుమార్ బుధవారం విడుదల చేశారు. ఈ పాటపై తన అభిప్రాయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. 'సీఎం కేసీఆర్‌ మీద రూపొందించిన పాటను రిలీజ్ చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నది. ఆ పాటను వింటే మీకు రోమాలు నిక్కబొడుచుకోవడం గ్యారెంటీ. మనసుకు ఆహ్లాదకరమైన సాహిత్యంతో పాటు పాటను కంపోజ్ చేసి పాడిన మాట్ల తిరుపతికి నా అభినందనలు. ఇది కేవలం పాట మాత్రమే కాదు. కేసీఆర్ జీవిత ప్రస్థానాన్ని మన ఉంచే ఒక దృశ్యకావ్యం' అంటూ పాటను అభినందించారు.

ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది ఈ పాటను తమ అకౌంట్లలో షేర్ చేస్తున్నారు. మీరు కూడా వినాలని అనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.


First Published:  18 Oct 2023 9:45 AM GMT
Next Story