Telugu Global
Telangana

కంటెంట్ ఉన్న మూవీ లాగే... కంటెంట్ ఉన్న లీడర్ పాన్ ఇండియా లీడర్ కాలేడా?... కేటీఆర్

సినిమా దర్శకుడు దశరథ్ రాసిన 'కథారచయిత' పుస్తాకావిష్కరణ కార్యక్రమం ఈ రోజు ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, క్రియేటీవ్ కంటెంట్ అంటే తనకు చాలా ఇష్టమ‌ని, అమెరికాలో ఉన్నప్పుడు కూడా విరివిగా పుస్తకాలు చదివే వాడినని, రోజూ దాదాపు 12 పత్రికలు చదివేవాడినని చెప్పారు.

కంటెంట్ ఉన్న మూవీ లాగే... కంటెంట్ ఉన్న లీడర్ పాన్ ఇండియా లీడర్ కాలేడా?... కేటీఆర్
X

కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీలవుతున్నప్పుడు కంటెంట్ ఉన్న తెలుగు లీడర్ పాన్ ఇండియా లీడర్ కాలేడా ? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ కంటెంట్ ఉన్న లీడర్ అని అందుకే మేము పాన్ ఇండియాకు వెళ్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

సినిమా దర్శకుడు దశరథ్ రాసిన 'కథారచయిత' పుస్తాకావిష్కరణ కార్యక్రమం ఈ రోజు ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, క్రియేటీవ్ కంటెంట్ అంటే తనకు చాలా ఇష్టమ‌ని, అమెరికాలో ఉన్నప్పుడు కూడా విరివిగా పుస్తకాలు చదివే వాడినని, రోజూ దాదాపు 12 పత్రికలు చదివేవాడినని చెప్పారు.

సినీ రంగంలో అజ్ఞాత శూరులు చాలా మంది ఉన్నారని చెప్పిన కేటీఆర్ ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటే తప్ప గొప్ప వక్తలు కాలేరు, కరోనా సమయంలో కేసీఆర్ ప్రసంగం కోసం జనం వేచి చూసేవారన్నారు. ప్రజలకు అర్దమయ్యేలా సులభమైన భాషలో చెప్పడం కేసీఆర్ గొప్ప లక్షణమని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం దేశంలో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ ఉన్న మూవీలు పాన్ ఇండియా లో సక్సెస్ అవుతున్నాయి. అలాగే కేసీఆర్ వంటి కంటెంట్ ఉన్న లీడర్ కూడా పాన్ ఇండియాలో ఎందుకు సక్సెక్ కారు అని ఆయన ప్రశ్నించారు.

First Published:  9 Jan 2023 4:25 PM GMT
Next Story