Telugu Global
Telangana

కవితపై అనుచిత వ్యాఖ్య‌లు:బండి సంజయ్ పై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు

రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇవ్వాలని మహిళా కమిషన్ బండిసంజయ్ కి నోటీసులు జారీ చేసింది.

కవితపై అనుచిత వ్యాఖ్య‌లు:బండి సంజయ్ పై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు
X

బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయ్యింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో వైపు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇవ్వాలని మహిళా కమిషన్ బండిసంజయ్ కి నోటీసులు జారీ చేసింది.

అంతే కాకుండా బండి సంజయ్ పై బీఆరెస్ కార్యకర్తలు రాష్ట్రంలోని అనేక పోలీసు స్టేషన్లలో పిర్యాదులు చేస్తున్నారు.

కాగా, బండి సంజయ్ కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. సంజయ్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు సాగుతున్నాయి.

మరో వైపు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మహిళామంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాతోడ్ లు బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. మహిళ పట్ల ఆయనకు కనీస గౌరవం లేదని వారు మండిపడ్డారు.

First Published:  11 March 2023 10:11 AM GMT
Next Story