Telugu Global
Telangana

ఈ ఏడాది 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం...మంత్రి హరీష్ వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలో 6,431 డాక్టర్ పోస్టులు, 7600 స్టాఫ్ నర్సులు, 5192 పారా మెడికల్ సిబ్బంది ,1,900 మంది ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 21,200 మంది కొత్త సిబ్బందిని నియమించిందని హరీష్ రావు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒక్క ఖాళీ కూడా లేకుండా పోస్టులన్నీ భర్తీ చేశామని ఆయన చెప్పారు.

ఈ ఏడాది 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం...మంత్రి హరీష్ వెల్లడి
X

రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం కోరుట్లలో రూ. 20 కోట్లతో అప్‌గ్రేడ్ చేసిన 100 పడకల ఆసుపత్రికి మంత్రి శంకుస్థాపన చేసిన‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎనిమిదేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని , రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేయడమే బీఆరెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలో 6,431 డాక్టర్ పోస్టులు, 7600 స్టాఫ్ నర్సులు, 5192 పారా మెడికల్ సిబ్బంది ,1,900 మంది ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 21,200 మంది కొత్త సిబ్బందిని నియమించిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒక్క ఖాళీ కూడా లేకుండా పోస్టులన్నీ భర్తీ చేశామని ఆయన చెప్పారు.

ఈ ఎనిమిదేళ్ళలో దేశంలో నిరుద్యోగం 6 శాతం నుంచి 8.3 శాతానికి పెరిగిందని, తెలంగాణలో మాత్రం నిరుద్యోగిత రేటు 4.1 మాత్రమే ఉందని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణలో మూడు డయాలసిస్ సెంటర్లు ఉండేవని, ఇప్పుడు 122 ఉన్నాయని, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణలో 200 ఐసీయూ పడకలను 6 వేలకు పెంచామని గుర్తు చేశారు.

వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఆ విషయం కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుందని హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ శాఖకు అధిక ప్రాధాన్య త ఇస్తున్నారని, నిధులు కూడా పెద్ద ఎత్తున మంజూరు చేస్తున్నారని ఆయన అన్నారు.

First Published:  5 Jan 2023 11:13 AM GMT
Next Story