Telugu Global
Telangana

ఆడబిడ్డల సమస్యను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం..

శానిటరీ న్యాప్కిన్స్ బదులు వస్త్రాలు ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య ఉత్తర ప్రదేశ్ లో అత్యథికం. ఆ రాష్ట్రంలో 69.4 శాతం మంది మహిళలు వస్త్రాలను ఉపయోగిస్తున్నారు.

ఆడబిడ్డల సమస్యను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం..
X

ఇటీవల ఓ బాలిక శానిటరీ న్యాప్కిన్స్ ని ప్రభుత్వం ఉచితంగా ఎందుకు ఇవ్వదు అని ప్రశ్నించినందుకు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన తలతిక్క సమాధానం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీహార్ ప్రభుత్వం బాలికలకు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పుకున్నా.. ఆ సాయంతో బాలికలు న్యాప్కిన్సే కొనుక్కుంటారని ఎందుకనుకోవాలి. ఆ డబ్బుల్ని కుటుంబ అవసరాలకు పెద్దలు ఖర్చు పెడితే పిల్లలకు ఆ సమస్యతీరేదెలా..? తెలంగాణ ప్రభుత్వం మాత్రం బాలికలకు అవసరమైన న్యాప్కిన్స్ తోపాటు కొబ్బరినూనె, సబ్బులు, పౌడర్ వంటి ఇతర వస్తువులు కూడా ఉచితంగా అందిస్తోంది. ఇప్పుడు కాదు, ఎనిమిదేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సున్నిత సమస్యను అర్థం చేసుకుని ఆడబిడ్డలను అక్కున చేర్చుకుంది. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో చదివే 8లక్షలమంది అమ్మాయిలకు ఆయా వస్తువులను ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం.

50శాతం మంది ఇంకా...

విషాదకరమైన నిజం ఏంటంటే.. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా భారత్ లో ఇంకా 50శాతం మంది మహిళలు బహిష్టు సమయంలో బట్టనే వాడుతున్నారు. గుడ్డతో చేసిన న్యాప్కిన్స్ వల్ల ఇబ్బందిగా ఉన్నా, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినా.. ఆ సమయంలో అవి మినహా వారికి మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతగా సహకరించదు. భారత్ ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేస్తామంటూ ప్రగల్భాలు పలికే కోతల రాయుళ్లకు అసలా సమస్య పట్టనే పట్టదు. గిరిజన మహిళకు అత్యున్నత పదవిని ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటున్న మనం, దేశంలో 50శాతం మంది మహిళలు బహిష్టు సమయంలో వస్త్రాలనే వాడుతున్నారని చెప్పుకోడానికి సిగ్గుపడాల్సిందే..?



బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థితి దయనీయం..

శానిటరీ న్యాప్కిన్స్ బదులు వస్త్రాలు ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య ఉత్తర ప్రదేశ్ లో అత్యథికం. ఆ రాష్ట్రంలో 69.4 శాతం మంది మహిళలు వస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అంటే ఇది దేశ సగటుకంటే చాలా ఎక్కువ. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక.. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఈ దురవస్థ ఎక్కువగా ఉంది. ఇక శానిటరీ న్యాప్కిన్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ ఉన్నాయి.

నిస్సిగ్గుగా జీఎస్టీ..

పిల్లలు తాగే పాలపైన కూడా జీఎస్టీ వేసి వికటాట్టహాసం చేస్తున్న కేంద్రం శానిటరీ న్యాప్కిన్స్ ని మాత్రం ఎందుకు వదిలిపెడుతుంది చెప్పండి. శానిటరీ న్యాప్కిన్స్ పై 12శాతం జీఎస్టీ వేసిన కేంద్రం.. ఆ తర్వాత విమర్శలకు తలొగ్గి దాన్ని తొలగించామని చెప్పింది. నక్క జిత్తులు చూపించి న్యాప్కిన్స్ తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలపై జీఎస్టీని కొనసాగించింది. అంతిమంగా న్యాప్కిన్స్ పై జీఎస్టీ లేదు, కానీ జీఎస్టీతో కలిపి రేటు పెంచి అమ్ముతారనమాట. ఇదీ కేంద్రంలోని బీజేపీ దౌర్భాగ్యం. న్యాప్కిన్స్ పై జీఎస్టీ లేదు అని గొప్పలు చెప్పుకోవడం ఈ వికృతానికి పరాకాష్ట. విద్యార్థినులకు ఉచితంగా న్యాప్కిన్స్ ఇస్తున్నా కూడా దానికి ప్రచారం చేసుకోకపోవడం తెలంగాణ ప్రభుత్వం గొప్పదనం, ఆడబిడ్డల వ్యక్తిగత విషయాలకు కేసీఆర్ సర్కారు ఇస్తున్న గౌరవం.

First Published:  7 Oct 2022 4:22 PM GMT
Next Story