Telugu Global
Telangana

పూణే రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తెలంగాణ యువకులు మృతి

దర్శనం చేసుకున్న అనంతరం వివిధ పర్యాటక ప్రాంతాలు సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం సాయంత్రం పూణే సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది.

పూణే రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తెలంగాణ యువకులు మృతి
X

పూణే వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతిచెందినవారంతా 27 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ఆదివారం అజ్మీర్‌ దర్గాకు వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన మహబూబ్‌ ఖురేషీ, రఫీక్‌ ఖురేషీ, ఫిరోజ్‌ ఖురేషీ, కంగ్టి గ్రామానికి చెందిన ఫిరోజ్‌ ఖురేషీ, వెంకటాపూర్‌కు చెందిన సయ్యద్‌ అమర్, సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన మజీద్‌ పటేల్‌.. కలిసి రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు ఆదివారం కారులో వెళ్లారు. దర్శనం చేసుకున్న అనంతరం వివిధ పర్యాటక ప్రాంతాలు సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం సాయంత్రం పూణే సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో మహబూబ్, రఫీక్, ఫిరోజ్, మజీద్‌ పటేల్, ఫిరోజ్‌ ఖురేషీ (కంగ్టి) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ సయ్యద్‌ అమర్‌ పూణే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

First Published:  3 July 2024 2:07 AM GMT
Next Story