Telugu Global
Telangana

రైతులకు 5 గంటలకు మించి విద్యుత్ అవసరం లేదు- కర్ణాటక డిప్యూటీ సీఎం

ఇప్పుడు 5 గంటల కరెంట్ చాలు అంటున్న ఇదే డీకే శివకుమార్.. కొద్దిరోజుల కిందట తెలంగాణ ప్రచారానికి వచ్చినప్పుడు మరోలా మాట్లాడారు.

రైతులకు 5 గంటలకు మించి విద్యుత్ అవసరం లేదు- కర్ణాటక డిప్యూటీ సీఎం
X

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కష్టాలు తప్పవని అధికార BRS పదే పదే హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చారు. రైతులకు ఉచిత కరెంట్‌పై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రైతులకు 5 గంటలకు మించి విద్యుత్ అవసరం లేదని, కర్ణాటకలో తాము రైతులకు 5 నుంచి 7 గంటలకు మించి విద్యుత్ ఇవ్వడంలేదని మరోసారి ఒప్పుకున్నారు. ఐదారు గంటల కరెంట్‌ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెబుతున్నప్పటికీ నాణ్యమైన కరెంట్ 3 గంటల కూడా రావట్లేదని అక్కడి రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ఇప్పుడు 5 గంటల కరెంట్ చాలు అంటున్న ఇదే డీకే శివకుమార్.. కొద్దిరోజుల కిందట తెలంగాణ ప్రచారానికి వచ్చినప్పుడు మరోలా మాట్లాడారు. తాము అతికష్టం మీద కర్ణాటక రైతులకు 5 గంటల కరెంట్ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. సప్లయ్ పెంచేందుకు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నామని చెప్పారు. కానీ, ఇవాళ 5 గంటల కరెంట్ మా రైతులకు మస్తుగా సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదని మాట్లాడారు.

ఇక్కడి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం రైతులకు 3 గంటల కరెంట్ చాలని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 24గంటల ఉచిత కరెంట్ రైతులకు అందుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అటు రైతులు, ఇటు సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

First Published:  25 Nov 2023 12:15 PM GMT
Next Story