Telugu Global
Telangana

మునుగోడు బరిలో మిగిలింది 47 మంది

మునుగోడు ఉపఎన్నికల బరిలో చివరకు 47 మంది అభ్యర్థులు మిగిలారు. మొత్త 83 మంది అభ్యర్థుల్లో 36 మంది ఉపసంహరించుకోగా 47 మంది మిగిలారు.

మునుగోడు బరిలో మిగిలింది 47 మంది
X

మునుగోడు ఉపఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజు చివరి రోజు. మొత్తం 130 మంది నామినేషన్లు వేయగా 47 నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. మిగతా 83 మందిలో ఈ రోజు వరకు 36 మంది అభ్యర్థులునామినేషన్లు ఉపసంహరించుకోగా రంగంలో 47 మంది మిగిలారు.


47 మంది ఎన్నికల రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. టీఆరెస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు బరిలో ఉన్నారు.






Next Story