Telugu Global
Telangana

హైదరాబాద్‌లో ఆరోగ్య ర‍ంగం మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ కోసం రూ.3,000 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగం అభివృద్ది కోసం అత్యధిక నిధులు కేటాయిస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే ఆరోగ్య ర‍ంగం మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ కోసం రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తోంది.

హైదరాబాద్‌లో ఆరోగ్య ర‍ంగం మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ కోసం రూ.3,000 కోట్లు
X

హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ సౌకర్యాలను అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. కేవలం హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 18 నెలల్లో రూ. 3000 కోట్ల‌ విలువైన వైద్య ప్రాజెక్టులను ప్రారంభించింది.


తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సేవలను అభివృద్ధి చేయడం కోసం భారీ వ్యయం చేస్తూనే అనేక కొత్త మెడికల్ కాలేజీలను స్థాపించడానికి

ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. వీటితో పాటు రాష్ట్రంలో 350 పడకల స్పెషాలిటీ టీచింగ్ ఆసుపత్రుల ఏర్పాటు కూడా జరుగుతోంది.


గత 18 నెలల్లో, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ బోధనాసుపత్రులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పనులను ప్రారంభించింది. అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) ప్రధాన క్యాంపస్ హెరిటేజ్ భవనం కారణంగా జాప్యం అవుతున్నప్పటికీ, హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలలో ఉస్మానియా అనుబంధ సూపర్-స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ అప్‌గ్రేడ్ చేస్తున్నారు.


ఎర్రగడ్డలోని ఫీవర్‌ ఆసుపత్రి, కోటి ఇఎన్‌టి ఆసుపత్రి, చెస్ట్‌ ఆసుపత్రిలో విస్తరణ పనులు జరుగుతుండగా, పేట్లబుర్జ్‌, సుల్తాన్‌బజార్‌, నీలోఫర్‌ సహా ప్రసూతి ఆసుపత్రుల్లో ఇప్పటికే విస్తరణ పనులు పూర్తయ్యాయి.


ఫీవర్ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం 1,000 మంది వరకు రోగులకు వసతి కల్పించే కొత్త ఔట్ పేషెంట్ బ్లాక్, డయాలసిస్ సౌకర్యం, అత్యాధునిక మార్చురీని నిర్మించడానికి 11 కోట్ల రూపాయలు కేటాయించింది. కోటి ఈఎన్‌టీ ఆస్పత్రిలో దాదాపు రూ. 35 కోట్లతో 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు 100 పడకల అత్యాధునిక ఇన్‌పేషెంట్ బ్లాక్‌ను నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి 100 కోట్ల రూపాయలుఖర్చు చేస్తోంది. రూ.65 కోట్లతో 300 పడకల కొత్త బ్లాకుతో పాటు, గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం CT స్కాన్ వంటి అత్యాధునిక రోగనిర్ధారణ పరికరాలను కొనుగోలు చేయడానికి, ఎనిమిది మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లుఅభివృద్ధి చేయడానికి దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేసింది.


ఒక్క ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న టీచింగ్‌ ఆసుపత్రుల అభివృద్దే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి దాదాపు రూ.100 కోట్లు కేటాయించింది. ఆసుపత్రిలో రూ. 50 కోట్లతో త్వరలో 200 పడకల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ (MCH) ఫ్లోర్ ఏర్పాటు కానుంది. రూ. 30 కోట్లతో కేంద్రీకృత రాష్ట్ర అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటు జరగనుంది. ఇటీవలే, రూ. 10 కోట్లకు పైగా విలువైన అత్యాధునిక CT, MRI ఇమేజింగ్ సౌకర్యాలు ప్రారంభించబడ్డాయి.


గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి దాదాపు రూ. 186 కోట్లు. థర్డ్ గ్రేడ్ ఆసుపత్రులలో కొనసాగుతున్న అప్‌గ్రేడేషన్ పనులతో పాటు, ఎల్‌బి నగర్, సనత్‌నగర్, అల్వాల్, మేడ్చల్-మల్కాజిగిరిలో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రూ. 2, 679 కోట్లు మంజూరు చేసింది.


First Published:  17 Oct 2022 6:24 AM GMT
Next Story