తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
BY Vamshi Kotas2 Oct 2024 11:37 AM GMT
X
Vamshi Kotas Updated On: 2 Oct 2024 11:37 AM GMT
తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నాది.
ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
Next Story