Telugu Global
Telangana

TSPSC పేపర్ లీకేజీ కేసులో 19 మంది సాక్షులు

ప్రవీణ్, రాజశేఖర్ తో సహా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర లక్ష్మిల వద్ద అసిస్టెంట్లుగా పని చేస్తున్నవారిని, కర్మన్ ఘాట్ లోని ఆర్ స్క్వైర్ హోటల్ యజమాని, ఆ హోటల్ లో పని చేస్తున్న సిబ్బందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు.

TSPSC పేపర్ లీకేజీ కేసులో 19 మంది సాక్షులు
X

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు పురోగతిలో ఉంది. ఇప్పటికే 9 మందిపై కేసు నమోదు చేసి ఆరెస్టు చేసిన పోలీసులు దాదాపు వంద మందిని విచారించారు. ప్రధాన నిందితులు ప్రవీణ్ , రాజశేఖర్, రేణుక, డాక్యా నాయక్ ల సన్నిహితులను విచారించారు.

ఇక ప్రవీణ్, రాజశేఖర్ తో సహా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర లక్ష్మిల వద్ద అసిస్టెంట్లుగా పని చేస్తున్నవారిని, కర్మన్ ఘాట్ లోని ఆర్ స్క్వైర్ హోటల్ యజమాని, ఆ హోటల్ లో పని చేస్తున్న సిబ్బందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. ఈ హోటల్ లోనే డాక్యా నాయక్, గోపాల్, నీలేష్ లు బస చేశారు. ఇక్కడే నీలేష్, గోపాల్ లకు డాక్యానాయక్ ప్రశ్నాపత్రం అందించగా అక్కడే వాళ్ళిద్దరూ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. వీరు ఆ హోటల్ లో బసచేసినట్టు,పరీక్ష రోజు ఉదయమే బైటికి వెళ్ళినట్టి హోటల్ సీసీ కెమరాల్లో రికార్డ్ అయ్యింది.

ఈ కేసులో అనేక మందిని విచారించిన తర్వాత సిట్ అధికారులు మొత్తం 19 మందిని సాక్షులుగా నిర్దారించారు. అలాగే నిందితులుగా మరింత మందిని చేర్చే అవకాశం ఉంది.

First Published:  24 March 2023 8:46 AM GMT
Next Story