తెలంగాణలో మరో 101 బస్తీ దవాఖానలు
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి మొదటి దశలో వివిధ పట్టణ స్థానిక సంస్థలలో (యుఎల్‌బి) 85 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది.ఇప్పుడు రెండవ దశలో మరో 101 ఏర్పాటు చేయనుంది.

ఈ సంవత్సరం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు,మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో మరో 101 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనుంది.
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి మొదటి దశలో వివిధ పట్టణ స్థానిక సంస్థలలో (యుఎల్‌బి) 85 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది.ఇప్పుడు రెండవ దశలో మరో 101 ఏర్పాటు చేయనుంది. మొదటి దశ విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 63 పట్టణ స్థానిక సంస్థలలో నెలకొల్పేందుకు రెండవ దశలో మరో 101 బస్తీ దవాఖానలను మంజూరు చేసింది. ఒక్కో దవాఖానను రూ.13.2 లక్షలు మజూరు చేశారు.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజల సౌకర్యార్థం జనాభాను బట్టి రెండు లేదా అంతకంటే ఎక్కువ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్లినిక్‌లు కోవిడ్-19 మహమ్మారి సమయంలో నాణ్యమైన సేవలను అందించాయి. ప్రజలు, ప్రత్యేకించి పేద,రోజువారీ కూలీలు, కార్మికులకు బాగా ఉపయోగపడుతున్నాయి.
రెండో దశలో ఏర్పాటు చేయనున్న 101 బస్తీ దవాఖానల్లో ఇప్పటికే 14 పూర్తయ్యాయి.
మరో 36 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సీనియర్ అధికారి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థ(ULB)లలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడానికి బస్తీ దవాఖానలను ప్రారంభించింది. ఈ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు ఉచిత కన్సల్టేషన్‌తో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వపు టి-డయాగ్నస్టిక్ ద్వారా పట్టణ పేదలకు బస్తీ దవాఖానాలలో 60కి పైగా వివిధ రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. T-డయాగ్నోస్టిక్స్ భాగస్వామ్యంతో సంబంధిత బస్తీ దవాఖానాలలో రోగుల నుండి సేకరించిన నమూనాలను ప్రాసెసింగ్ కోసం సమీప కేంద్రీకృత డయాగ్నస్టిక్ హబ్‌కు పంపుతారు.