Telugu Global
Telangana

తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో లక్ష పేజీల 'సాక్ష్యం' !

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్ర‌య‌త్నాల కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) వ‌ర్గాలు తమ వద్ద లక్ష పేజీల 'సాక్ష్యాలు' ఉన్నాయని చెబుతున్నాయి. ద‌ర్యాప్తు ఇంకా కొన‌సాగుతున్నందున పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌లేమ‌ని చెప్పారు.

తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో లక్ష పేజీల సాక్ష్యం !
X

ఎమ్మెల్యేలను 'కొనుగోలు' చేయడానికి ప్రయత్నించారనే కేసులో నిందితులు బిజెపి ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ త‌దిత‌ర పార్టీ అగ్ర నాయకుల పేర్లను ప్రస్తావించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో సంతోష్ ఈ రోజున (21న‌వంబ‌ర్‌) హైదరాబాద్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిట్ ఎదుట ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని సిట్ నవంబర్ 16న నోటీసు జారీ చేసింది. అయితే బీఎల్ సంతోష్ సిట్ ఎదుట హాజరుకావడం లేదు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్ర‌య‌త్నాల కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) వ‌ర్గాలు తమ వద్ద లక్ష పేజీల పత్రాల రూపంలో 'సాక్ష్యాలు' ఉన్నాయని చెబుతున్నాయి. ద‌ర్యాప్తు ఇంకా కొన‌సాగుతున్నందున పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌లేమ‌ని చెప్పారు.

బీఎల్ సంతోష్ ఢిల్లీలో లేనందున ఢిల్లీ పోలీసుల ద్వారా అందజేయాల్సిన నోటీసు అందలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.

సిట్ ఏకపక్షంగా, అక్రమంగా నోటీసులు జారీ చేస్తోందని ఆరోపిస్తూ ఆ నోటీసులను ఆపేయాలని నవంబర్ 18న బీజేపీ గతంలో కోర్టును ఆశ్రయించింది. అందుకు అంగీకరించని కోర్టు బీఎల్ సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేయరాదని చెప్పిన కోర్టు ఆయనకు సిట్ నోటీసులు అందజేసే విషయంలో సహకరించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ ద‌ర్యాప్తును హైకోర్టు పర్యవేక్షిస్తుందని కోర్టు పేర్కొన్న విష‌యం తెలిసిందే.

First Published:  21 Nov 2022 9:44 AM GMT
Next Story