Telugu Global
Telangana

లక్ష కెమెరాలు, హెలిప్యాడ్‌.. హైదరాబాద్‌ పోలీసుల వార్‌రూమ్‌ రెడీ.!

హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్ కంట్రోల్‌ సెంటర్‌లో అధునాతన సాంకేతికత సహాయంతో లక్ష కెమెరాలను ఒకేసారి పరిశీలించవ‌చ్చు. ఇక సిటీలో ట్రాఫిక్‌ కదలికలను సైతం రియల్‌ టైం ట్రాక్ చేయగల మానిటరింగ్ సిస్టమ్‌ను వార్‌ రూమ్‌లో ఏర్పాటు చేశారు.

లక్ష కెమెరాలు, హెలిప్యాడ్‌.. హైదరాబాద్‌ పోలీసుల వార్‌రూమ్‌ రెడీ.!
X

లక్ష సీసీ కెమెరాలు, రియల్‌ టైం ట్రాఫిక్ మానిటరింగ్‌ సిస్టమ్‌, హెలిప్యాడ్‌.. ఇలాంటి అత్యాధునిక సదుపాయాలతో హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్ కంట్రోల్‌ సెంటర్‌లోని కొత్త వార్‌ రూమ్‌ అమెరికాలోని పెంటగాన్‌ మిలిటరీ కమాండ్‌ సెంటర్‌ను తలపిస్తోంది. తాజాగా హోం మంత్రి మహమూద్‌ అలీ.. సేఫ్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా మరో 2,500 కెమెరాలను ప్రారంభించారు. దీంతో పాటు మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్, వార్ రూమ్, విజిటర్స్ గ్యాలరీని కూడా నేడు ఓపెన్ చేశారు.

దేశంలోనే అతిపెద్ద సీసీ టీవీ సర్వేలైన్స్‌ హైదరాబాద్‌లోనే ఉందన్నారు హోంమంత్రి మహమూద్‌ అలీ. శాంతి, భద్రతల పర్యవేక్షణలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌ వన్‌ అంటూ ప్రశంసలు కురిపించారు.



హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్ కంట్రోల్‌ సెంటర్‌లో అధునాతన సాంకేతికత సహాయంతో లక్ష కెమెరాలను ఒకేసారి పరిశీలించవ‌చ్చు. ఇక సిటీలో ట్రాఫిక్‌ కదలికలను సైతం రియల్‌ టైం ట్రాక్ చేయగల మానిటరింగ్ సిస్టమ్‌ను వార్‌ రూమ్‌లో ఏర్పాటు చేశారు. వీటితో పాటు వాతావరణాన్ని అంచనా వేసే సిస్టమ్‌ను సైతం ఈ బిల్డింగ్‌లో అందుబాటులో ఉంచారు. విపత్తు నిర్వహణ సమయాల్లో అన్ని విభాగాలు సమన్వయం చేసుకునేలా వ్యవస్థ కూడా ఈ బిల్డింగ్‌ సొంతం. అత్యవసర సమయంలో హెలికాప్టర్ల టేకాఫ్, ల్యాండింగ్ కోసం బిల్డింగ్‌పై హెలిప్యాడ్‌ కూడా ఉంది.

గతేడాది ఆగస్టులో తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీఎస్‌ఐసీసీసీ)ని ప్రారంభించారు కేసీఆర్. ఐదు బ్లాకులున్న ఈ బిల్డింగ్‌ను నిర్మించేందుకు తెలంగాణ సర్కార్‌ రూ. 500 కోట్లు ఖర్చు చేసింది. టవర్‌-ఏలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మొత్తం 19 అంతస్తులు ఉన్నాయి. ఇక బీ-టవర్‌లో రెండు బేస్‌మెంట్‌ అంతస్తుల పైన.. 15 అంతస్తులున్నాయి. టవర్‌-సిలో ఆడిటోరియం, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తులున్నాయి. టవర్-డిలో గ్రౌండ్ ఫ్లోర్‌తో సహా రెండు అంతస్తులున్నాయి. టవర్-E లో కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌ ఉంది. వీటన్నింటిలో టవర్‌-ఏ ఎత్తైనది. ఈ టవర్‌లో నాలుగో అంతస్తులో డీజీపీ ఛాంబర్‌, 18వ అంతస్తులో హైదరాబాద్ సీపీ ఛాంబర్‌, ఏడో అంతస్తులో ఇతర ఉన్నత స్థాయి అధికారుల ఛాంబర్లు ఉన్నాయి.

First Published:  25 Sep 2023 5:15 PM GMT
Next Story