Telugu Global
Telangana

1కోటి 50 లక్షల మందికి 'కంటి వెలుగు'...ఈ నెల 18 నుంచి జూన్ 15 వరకు సాగనున్న కార్యక్రమం

జనవరి 18 నుండి జూన్ 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 1.50 కోట్ల మందికి ప్రాథమిక కంటి పరీక్షలను నిర్వహిస్తారు. సాధారణ కంటి జబ్బులకు ఉచిత కళ్లద్దాలు, మందులను అందజేస్తారు. మొత్తం 55 లక్షల కళ్లద్దాలు అందజేయనున్నారు.

1కోటి 50 లక్షల మందికి కంటి వెలుగు...ఈ నెల 18 నుంచి జూన్ 15 వరకు సాగనున్న కార్యక్రమం
X

జనవరి 18న, రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మకమైన‌ కంటి వెలుగు కార్యక్రమం రెండవ దశను ప్రారంభించనుంది. ఈ మెగా కంటి స్క్రీనింగ్ శిబిరాలు 16,533 ప్రదేశాలలో 100 రోజుల‌ పాటు నిర్వహించనున్నారు.

జనవరి 18 నుండి జూన్ 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 1.50 కోట్ల మందికి ప్రాథమిక కంటి పరీక్షలను నిర్వహిస్తారు. సాధారణ కంటి జబ్బులకు ఉచిత కళ్లద్దాలు, మందులను అందజేస్తారు. మొత్తం 55 లక్షల కళ్లద్దాలు అందజేయనున్నారు. వాటిలో 30 లక్షలు రీడింగ్ గ్లాసులు కాగా మిగిలినవి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు.

కంటి వెలుగు మొదటి దశ ఆగస్ట్ 2018 నుండి మార్చి 2019 మధ్య ఎనిమిది నెలల పాటు 827 వైద్య బృందాలతో నిర్వహించారు. ఈ సంవత్సరం, 1500 వైద్య బృందాలు 100 రోజులపాటు నిరంతరంగా పనిచేస్తాయి.

కంటి పరీక్ష శిబిరాలను నిర్వహించే 1491 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారుల తాత్కాలిక నియామకాన్ని ఆరోగ్య శాఖ పూర్తి చేసింది. ప్రతి శిబిరానికి ఆప్టోమెట్రిస్ట్, సూపర్‌వైజరీ ఆఫీసర్, ఇద్దరు సహాయక నర్స్ మిడ్‌వైవ్‌లు (ANMలు), ముగ్గురు అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్‌లు (ASHAలు), ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌లతో కూడిన వైద్య బృందం ఉంటుంది. కంప్యూటరైజ్డ్ కంటి స్క్రీనింగ్ చేస్తారు.

కంటి వెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ కార్యక్రమం. తెలంగాణను అంధత్వం నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి.

కంటి వెలుగు-II:

* కంటి వెలుగు II కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది

* జనవరి 18 , జూన్ 15 మధ్య 100 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

* 16,533 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు, వాటిలో 12,768 గ్రామీణ ప్రాంతాలు

* 1,500 వైద్య బృందాలు 1.50 కోట్ల మంది వ్యక్తులను పరీక్షిస్తారు.

* 30 లక్షల రీడింగ్, 25 లక్షల ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ సహా 55 లక్షల కంటి అద్దాలు అందిస్తారు

* ANM 2 వారాల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందజేస్తారు

ఈ కార్యక్రమం విజయవంత చేయడం కోసం రాష్ట్రప్రభుత్వం చేసిన‌ ఏర్పాట్లు:

* 850 ఆటో-రిఫ్రాక్టోమీటర్ (AR) యంత్రాలు అద్దెకు తీసుకున్నారు.

* 1500 ట్రయల్ లెన్స్ బాక్స్‌లు

* 1500 స్నెల్లెన్ ఐ చార్ట్‌లు

* 1500 ఐ టార్చ్ లు

* 1491 పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారులు

* 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్లు

* 969 మంది పీహెచ్‌సీ వైద్యులు

* 1500 వైద్య బృందాలు

First Published:  11 Jan 2023 2:51 PM GMT
Next Story