Telugu Global
Sports

యశస్వి జైస్వాల్‌కు బీసీసీఐ బంపర్‌ ఆఫర్‌

తిలక్‌ వర్మ, రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్‌ ఫస్ట్ టైం కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఇక స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ గ్రేడ్ - B నుంచి గ్రేడ్‌ - A జాబితాలోకి ప్రమోషన్ పొందాడు.

యశస్వి జైస్వాల్‌కు బీసీసీఐ బంపర్‌ ఆఫర్‌
X

యువ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌లకు షాకిచ్చింది బీసీసీఐ. ముందే హెచ్చరించిన విధంగా రంజీల్లో ఆడకపోవడంతో ఇద్దరు ప్లేయర్లను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి BCCI తొలగించింది. తాజాగా 2023-24 సంవత్సరానికి ప్రకటించిన బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్ల జాబితాలో వీరిద్దరి పేర్లు గల్లంతయ్యాయి. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని సమయాల్లో ప్లేయర్లందరూ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని బీసీసీఐ సూచించింది. ఐతే ఈ సూచనలను ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బేఖాతరు చేశారు. ఇక వీరితో పాటు ఛటేశ్వర్ పూజారా పేరును సైతం కాంట్రాక్టు నుంచి తొలగించింది BCCI.

తిలక్‌ వర్మ, రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్‌ ఫస్ట్ టైం కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఇక స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ గ్రేడ్ - B నుంచి గ్రేడ్‌ - A జాబితాలోకి ప్రమోషన్ పొందాడు. ఇక సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలకు A+ జాబితాలో కొనసాగుతున్నారు.

బీసీసీఐ పూర్తి కాంట్రాక్టు లిస్టు ఇదే -

Grade A+ - రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా

Grade A - అశ్విన్, మహ్మద్ షమి, సిరాజ్, కె.ఎల్.రాహుల్, శుభ్‌మన్ గిల్, హర్దిక్ పాండ్యా

Grade B - సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైశ్వాల్

Grade C - రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబె, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, కె.ఎస్.భరత్, ప్రసిద్ కృష్ణా, అవేష్‌ ఖాన్‌, రజత్ పాటిదార్

ఇక వీరితో పాటు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఆకాష్‌ దీప్‌, విజయ్ కుమార్ వైషక్, ఉమ్రాన్ మాలిక్, యశ్ దయాల్ పేర్లను సైతం కాంట్రాక్టు జాబితాలో పరిశీలించాలని బీసీసీఐకి సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. దీంతో పాటు 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20 మ్యాచులు ఆడిన ప్లేయర్లు ఆటోమేటిక్‌గా గ్రేడ్‌-C కేటగిరీలోకి వస్తారని స్పష్టం చేసింది. ప్రస్తుతం ధృవ్ జురెల్, సర్ఫరాజ్‌ ఖాన్ రెండేసి టెస్టు మ్యాచులు ఆడారు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టు తర్వాత ఈ ఇద్దరు గ్రేడ్ - సి జాబితాలోకి రానున్నారు.

First Published:  28 Feb 2024 1:44 PM GMT
Next Story