Telugu Global
Sports

భారత మీడియాకు పట్టని ప్రపంచకప్ ఫుట్ బాల్!

మనదేశంలో మీడియా తీరే వేరు. సందుల్లో గొందుల్లో జరిగే క్రికెట్ పోటీలకు ఇస్తున్న ప్రచారం, ప్రాధాన్యం.

భారత మీడియాకు పట్టని ప్రపంచకప్ ఫుట్ బాల్!
X

మనదేశంలో మీడియా తీరే వేరు. సందుల్లో గొందుల్లో జరిగే క్రికెట్ పోటీలకు ఇస్తున్న ప్రచారం, ప్రాధాన్యం..భారత గడ్డపై మొట్టమొదటిసారిగా జరుగుతున్న అండర్ -17 ప్రపంచ బాలికల ఫుట్ బాల్ పోటీలకు ఏమాత్రం ఇవ్వలేదు....

అంతర్జాతీయ బాలికా దినోత్సవం రోజునే భారత గడ్డపై అండర్ -17 ప్రపంచ బాలికల ఫుట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 16 దేశాల ఈ టోర్నీని మీడియా అంతగా పట్టించుకోకపోడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య నేతృత్వంలో భారత ఫుట్ బాల్ సంఘం నిర్వహిస్తున్న ఈటోర్నీని ప్రత్యేకంగా 17 సంవత్సరాల లోపు వయసు కలిగిన బాలికల కోసమే నిర్వహిస్తున్నారు.

16దేశాలజట్ల సమరం...

ప్రపంచవ్యాప్తంగా 204 దేశాలు ఫుట్ బాల్ ఆడుతుంటే పీఫా అండర్ -17 బాలికల ప్రపంచకప్ కు కేవలం 15 దేశాలు మాత్రమే అర్హత సాధించగా...ఆతిథ్యదేశం హోదాలో భారత్ కు నేరుగా పాల్గొనే అవకాశం దక్కింది.

వివిధ ఖండాలకు చెందిన 15 దేశాలజట్లలో బ్రెజిల్, మెురాకో, అమెరికా, జర్మనీ, నైజీరియా, చిలీ, కెనడా, ఫ్రాన్స్, మెక్సికో, చైనా, టాంజానియా, కొలంబియా, మెక్సికో, జపాన్ ఉన్నాయి. పోటీలకు ఆతిథ్యమిస్తున్న భారత్ తో సహా మొత్తం 16 దేశాలజట్లు నాలుగు గ్రూపులుగా తలపడుతున్నాయి.

ప్రారంభ పోటీలోనే భారత్ చిత్తు...

గ్రూప్- ఏ లీగ్ లో ప్రపంచ మేటిజట్లు జర్మనీ, అమెరికా, మొరాకోజట్లతో ఆతిథ్య భారత్ పోటీపడుతోంది. అమెరికాతో జరిగిన గ్రూప్ ప్రారంభలీగ్ పోరులో భారత్ 0-8 గోల్స్ తేడాతో పరాజయం చవిచూసింది.

తనకంటే ఎన్నోరెట్లు బలమైన అమెరికాకు భారత్ ఏమాత్రం సరిజోడీ కాలేకపోయింది. ఆట సగభాగానికే 5-0 గోల్స్ తో పైచేయి సాధించిన అమెరికా...రెండో భాగంలో మరో మూడు గోల్సు చేయగలిగింది.

ఆట 9, 31 నిముషాలలో మెలీనా రిబింబా, 15వ నిముషంలో చార్లోట్టీ కోలెర్, 23వ నిముషంలో గమారో, 39వ నిముషంలో గీసెల్ థాంప్సన్, 51వ నిముషంలో ఇల్లా ఇమ్రీ, 59వ నిముషంలో టేలర్ సారేజ్, 62వ నిముషంలో మియా బుటా తలోగోలు సాధించారు.

ఫుట్ బాల్ సంస్కృతి అంతగాలేని భారత్ లో మహిళాఫుట్ బాల్ పట్ల మణిపూర్, జార్ఖండ్, ఒరిస్సా, కేరళ, గోవా రాష్ట్ర్రాల మహిళలు, బాలికలు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుత అండర్ -17 ప్రపంచకప్ లో పాల్గొంటున్న భారతజట్టు కెప్టెన్ అష్టమ్ ఒరాన్ తో సహా అరడజనుమంది క్రీడాకారిణులు జార్ఖండ్ రాష్ట్ర్రానికి చేందినవారే కావడం విశేషం.

ప్రస్తుత ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యమివ్వకుంటే..ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం వచ్చి ఉండేదే కాదు.

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్యలో 204 దేశాలకు సభ్యత్వం ఉంటే..అంతర్జాతీయ సాకర్ ర్యాంకింగ్స్ లో భారత్ 101వ ర్యాంకులో కొనసాగుతోంది. క్రికెట్ క్రేజీ భారత్..ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించాలంటే కొన్ని దశాబ్దాలపాటు వేచిచూడక తప్పదని సాకర్ విశ్లేషకులు చెబుతున్నారు.




First Published:  12 Oct 2022 4:00 AM GMT
Next Story