Telugu Global
Sports

పారిస్ ఒలింపిక్స్ కు మరో ఇద్దరు భారత బాక్సర్ల అర్హత!

2024-పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలో పతకాల వేటకు భారత్ అరడజను మంది బాక్సర్లతో బరిలోకి దిగుతోంది.

పారిస్ ఒలింపిక్స్ కు మరో ఇద్దరు భారత బాక్సర్ల అర్హత!
X

2024-పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలో పతకాల వేటకు భారత్ అరడజను మంది బాక్సర్లతో బరిలోకి దిగుతోంది.

పారిస్ ఒలింపిక్స్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది వివిధ క్రీడాంశాలలో పాల్గొనటానికి అర్హత సాధించిన భారత అథ్లెట్ సంఖ్య సైతం పెరుగుతూ వస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో జరుగుతున్న ఒలింపిక్స్ అర్హత పోటీలలో పాల్గొంటూ భారత అథ్లెట్లు పారిస్ టికెట్ల కోసం పోరాడుతున్నారు.

ఆరుగురు భారత బాక్సర్లకే బెర్త్ లు...

పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలోని మొత్తం 12 విభాగాలలో పోటీకి దిగే అవకాశం ఉంటే..భారత బాక్సర్లు కేవలం ఆరు విభాగాలలో మాత్రమే అర్హత సాధించగలిగారు.

పురుషుల విభాగంలో ప్రపంచ పోటీల రన్నరప్ అమిత్ పంగల్ మాత్రమే ఒలింపిక్స్ అర్హత సాధించగా..మహిళల విభాగంలో ఐదుగురు బాక్సర్లు పారిస్ బెర్త్ లు సాధించడం విశేషం.

ఆసియా, ఆసియాక్రీడల బాక్సింగ్ లో భారత్ కు పలు పతకాలు అందించిన స్టార్ బాక్సర్ అమిత్ పంగల్..ఒలింపిక్స్ అర్హత పోరులో చైనా బాక్సర్ చువాంగ్ లియూను 5-0తో చిత్తు చేయడం ద్వారా టికెట్ ఖాయం చేసుకోగలిగాడు. గత ఒలింపిక్స్ లో పాల్గొన్న అమిత్ వరుసగా రెండో ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగాడు.

టోక్యో ఒలింపిక్స్ తరువాత అమిత్ పంగల్ పాల్గొన్న రెండుకు రెండుటోర్నీలలోనూ పతకాలు సాధించడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో బంగారు పతకం సాధించిన అమిత్...స్ట్ర్రాండ్జా మెమోరియల్ టోర్నీలో సైతం విజేతగా నిలిచాడు. డ్రా అనుకూలంగా వస్తే ఏదో ఒక పతకం సాధించే సత్తా ఉన్న బాక్సర్ గా అమిత్ కు గుర్తింపు ఉంది.

5వ మహిళా బాక్సర్ జాస్మిన్...

ఒలింపిక్స్ బాక్సింగ్ మహిళల విభాగంలో పాల్గొనటానికి అర్హత సాధించిన భారత ఐదవ బాక్సర్ గా జాస్మిన్ లాంబోరియా నిలిచింది. మహిళల 57 కిలోల తరగతిలో జాస్మిన్..క్వార్టర్ ఫైనల్స్ పోరులో మాలి బాక్సర్ మారిన్ కామెరాను చిత్తు చేసింది.

పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ లో నిశాంత్ దేవ్ ( 71 కిలోలు )స నిఖత్ జరీన్ ( 50 కిలోలు ), ప్రీతి పవార్ ( 54 కిలోలు ), లవ్లీనా బోర్గెయిన్ ( 75 కిలోలు ), అమిత్ పంగల్ ఉన్నారు.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే ఒలింపిక్స్ లో 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు తలపడనున్నారు. భారత్ కు చెందిన 125 మంది అధ్లెట్లు 20 రకాల క్రీడల్లో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

భారత అథ్లెట్లు టీమ్, వ్యక్తిగత అంశాలలో తలపడబోతున్నారు.

First Published:  3 Jun 2024 8:52 AM GMT
Next Story