Telugu Global
Sports

ట్విట్టర్ కింగ్ విరాట్ కొహ్లీ!

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..సోషల్ మీడియా వేదికల్లోనూ రికార్డుల మోత మోగిస్తున్నాడు.

Virat Kohli
X

Virat Kohli

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..సోషల్ మీడియా వేదికల్లోనూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే నంబర్ వన్ క్రికెట్ స్టార్ గా వెలిగిపోతున్న విరాట్..ట్విట్టర్ వేదికగానూ అగ్రస్థానంలో నిలిచాడు...

భారత మాజీ కెప్టెన్, సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లోపల, వెలుపలా తనదైన శైలిలో రికార్డుల మోత మోగిస్తున్నాడు. సామాజిక మాథ్యమాలైన ఇన్ స్టా గ్రామ్, ట్వి్టర్ వేదికలుగా అత్యధికమంది ఫాలోవర్స్ ను సంపాదించిన ఒకే ఒక్క, ఏకైక క్రికెటర్ గా నిలిచాడు.

ఇన్ స్టా గ్రామ్ టు ట్విట్టర్


సామాజిక మాధ్యమాల్లో విరాట్ జోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ స్టార్ క్రికెటర్ కు అభిమానుల కొరతే లేదు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో నంబర్ వన్ క్రికెటర్ గా నిలిచిన విరాట్ ...తాజాగా ట్విట్టర్‌ వేదికగాను ఆదేఘనతను సొంతం చేసుకోగలిగాడు. ట్విట్టర్ ద్వారా విరాట్ ని అనుసరించే అభిమానుల సంఖ్య తొలిసారిగా 5 కోట్లకు చేరింది.ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా విరాట్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

వేర్వేరు సామాజిక మాధ్యమాలు కలుపుకుని విరాట్‌ను అనుసరించేవారి సంఖ్య 21.1 కోట్ల పైనే ఉండటం విశేషం. దుబాయ్ వేదికగా ఇటీవలే ముగిసిన ఆసియాకప్ టో్ర్నీ సూపర్ -4 ఆఖరిరౌండ్ మ్యాచ్ లో తన 71వ శతకం సాధించడం ద్వారా విరాట్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

లాభసాటి వ్యాపారం..

క్రికెట్ ఫీల్డ్ తో పాటు యాడ్ మార్కెట్లలో సైతం విరాట్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. సోషల్ మీడియాను సైతం లాభసాటి వ్యాపారంగా మలచుకొన్న విరాట్ కి దాదాపుగా 22 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికలు సైతం ఉన్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఫ్లాట్ ఫామ్ ల్లో సగటున 7 కోట్ల మంది చొప్పున విరాట్ కొహ్లీని ఫాలోఅవుతున్నారు.

అమాంతం పెరిగిన ఫాలోవర్స్.....

కరోనా విలయతాండవానికి ముందు వరకూ క్రికెట్ మూడు ఫార్మాట్లలో ఒక వెలుగు వెలిగిన విరాట్ కొహ్లీ తన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానులను, సోషల్ మీడియా వేదికల ద్వారా తనను అనుసరించేవారి సంఖ్యను ఏడాది ఏడాదికీ గణనీయంగా పెంచుకొంటూ వచ్చాడు.

గత దశాబ్దకాలంగా తన బ్రాండ్ వాల్యూని సైతం అనూహ్యంగా పెంచుకొని రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. అంతటితోనే ఆగిపోకుండా...సోషల్ మీడియా ద్వారాను... తన పాపులారిటీని కోట్లరూపాయలుగా మలచుకొంటున్నాడు.

పోస్ట్ కు 5 కోట్లు

కొహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రమోషనల్ పోస్ట్ ను ఉంచినందుకు 5 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాడు. ప్రపంచ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో సమానంగా...ఇన్ స్టాగ్రామ్ ప్రమోషనల్ ఆదాయం సంపాదిస్తున్నాడు.

29 ఏళ్ల విరాట్ కొహ్లీకి...ఫేస్ బుక్ ద్వారా..3 కోట్ల 60 లక్షలకు పైగా లైక్ లు వస్తున్నాయి. ట్విట్టర్ లో కొహ్లీని 5 కోట్లమంది, ఇన్ స్టాగ్రామ్ ద్వారా 20 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఫోర్బెస్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం అత్యధిక సంపాదన ఉన్న...ప్రపంచ క్రీడాప్రముఖుల్లో విరాట్ కొహ్లీ మొదటి 10 మందిలో ఒకనిగా నిలిచాడు.

తొలి క్రికెటర్ విరాట్ కొహ్లీ....

గత ఏడాది వరకూ ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ ను అనుసరించే వారి సంఖ్య 20 కోట్లుగా ఉంది. అయితే ..హాప‌ర్‌హెచ్‌క్యూ 2022 ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ విడుదల చేసింది.

తాజా గణాంకాల ప్రకారం అది కాస్త 21 కోట్ల (201 మిలియన్లు )కు చేరింది.

ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడు మాత్రమే కాదు..తొలి క్రికెటర్ గాను కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసియాఖండానికి చెందిన తొలి వ్యక్తిగా కూడా విరాట్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. ట్విట్టర్ లో సైతం 5 కోట్లమంది ఫాలోవర్స్ ను సంపాదించిన తొలి క్రికెటర్ గా విరాట్ నిలిచాడు.

ప్రపంచవ్యాప్తంగా క్రీడాదిగ్గజాల వరుస నాలుగో స్థానంలో విరాట్ కొనసాగుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 337 మిలియన్ల ఫాలోవర్లతో పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. అర్జెంటీనా సూపర్ స్టార్ ప్లేయర్ మెస్సీ (260 మిలియన్లు), కొహ్లీ 201 మిలియన్లు, బ్రెజీలియన్ సాకర్ స్టార్ నెయ్‌మర్‌ (160 మిలియన్లు) మొదటి నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్‌ (50 మిలియన్లు), ఫేస్‌బుక్‌ (48 మిలియన్లు)లో కూడా కోహ్లీకి విపరీతమైన క్రేజ్‌ ఉంది.

క్రికెట్ ద్వారా ఆర్జించే మొత్తంతో సమానంగా సోషల్ మీడియా వేదికలుగాను విరాట్ సంపాదిస్తున్నాడు.

రెండోస్థానంలో సచిన్...

సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్లలో కొహ్లీ తర్వాతి స్థానంలో..మాస్టర్ సచిన్ టెండుల్కర్ నిలిచాడు. ట్విట్టర్ లో 3 కోట్ల 10 లక్షలు, ఫేస్ బుక్ లో 2 కోట్ల 80 లక్షలు, ఇన్ స్టాగ్రామ్ లో కోటీ 65 లక్షల మంది మాస్టర్ ను ఫాలోఅవుతున్నారు.

ఇక...భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫేస్ బుక్ లో 2 కోట్ల 50 లక్షలు, ట్విట్టర్లో 77 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో కోటీ 54 లక్షలమంది ఫాలోవర్స్ఉ న్నారు.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు, సురేశ్ రైనా ఐదు స్థానాలలో కొనసాగుతున్నారు.

యువరాజ్ సింగ్ ఆరు, హర్భజన్ సింగ్ ఏడు, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఎనిమిది, శిఖర్ ధావన్ తొమ్మిది, కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ పది స్థానాలలో కొనసాగుతున్నారు.

ఎండార్స్ మెంట్ల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న కొహ్లీ...సోషల్ మీడియాలో తనకున్న ఆదరణను సైతం పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకొంటూ..అదనపు సొమ్ము సంపాదిస్తున్నాడు.

First Published:  14 Sep 2022 5:29 AM GMT
Next Story