బాల్ పడకుండానే రెండో రోజు ఆట రద్దు
ఉదయం నుంచి వర్షం పడటంతో చిత్తడిగా మారిన మైదానం.. దీంతో ఆట రద్దు
BY Raju Asari28 Sept 2024 9:39 AM GMT
X
Raju Asari Updated On: 28 Sept 2024 9:39 AM GMT
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండోరోజు ఆట ఒక్క బాల్ పడకుండానే రద్దయ్యింది. వర్షం కారణంగా రెండో రోజు మ్యాచ్‌ను నిర్వహించలేకపోయారు. ఉదయం నుంచి వర్షం పడటంతో ఆడటానికి వీలు పడలేదు. వానతో మైదానమంతా చిత్తడిగా మారిపోయింది. మొదటిరోజు శుక్రవారం కూడా వర్షం కారణంగా సగానికిపైగా ఓవర్లు తుడిచిపెట్టుకుపోగా.. ఆటను కొన్ని గంటల ముందే ముగించారు.
తొలిరోజు 35 ఓవర్లే ఆడగా.. బంగ్లాదేశ్ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మొమినుల్ హక్ (40 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో ఒక టెస్ట్ నెగ్గిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉన్నది.
Next Story