Telugu Global
Sports

ఫాస్ట్ బౌలర్ల గాయాలకు అదే అసలు కారణం- కపిల్

భారతబౌలర్లు తరచూ గాయాలపాలు కావటానికి కారణమేంటో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ బయటపెట్టాడు. నెట్ ప్రాక్టీస్ తూతూమంత్రంగా చేయటమేంటంటూ నిలదీశాడు.

ఫాస్ట్ బౌలర్ల గాయాలకు అదే అసలు కారణం- కపిల్
X

భారతబౌలర్లు తరచూ గాయాలపాలు కావటానికి కారణమేంటో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ బయటపెట్టాడు. నెట్ ప్రాక్టీస్ తూతూమంత్రంగా చేయటమేంటంటూ నిలదీశాడు..

భారత ఫాస్ట్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, దీపక్ చహార్, హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తరచూ గాయాలపాలు కావటాన్ని మాజీ కెప్టెన్స దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ప్రశ్నించారు..

16 సంవత్సరాల తన క్రికెట్ కెరియర్ లో గాయంతో కనీసం ఒక్కసారిగా కూడా జట్టుకు దూరం కాలేదని, జట్టు అవసరాలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటూ వచ్చానని గుర్తు చేసుకొన్నారు.

తూతూ మంత్రంగా నెట్ ప్రాక్టీస్....

ఇటీవలి కాలంలో భారత ఫాస్ట్ , స్వింగ్ బౌలర్ల నెట్ ప్రాక్టీస్ మొక్కుబడిగా, తూతూ మంత్రంగా మారిందని, నెట్స్ లో ఎంతగా సాధన చేస్తే ఫాస్ట్ బౌలర్లు అంత ధృడంగా తయారు కాగలరని కపిల్ చెప్పారు.

జస్ ప్రీత్ బుమ్రా భారతజట్టుకు క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఎంతో కీలక బౌలర్ అని..అయితే..వెన్నెముక గాయంతో ఆసియాకప్ నుంచే అందుబాటులో లేకుండా పోడం, టీ-20 ప్రపంచకప్ కు దూరం కావడం జట్టు అవకాశాలను బాగా దెబ్బతీసిందని, ఇక..బంగ్లాదేశ్ తో సిరీస్ కు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భుజం నొప్పితో దూరం కావటం కూడా విజయావకాశాలను దెబ్బతీసిందని, డాషింగ్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, స్వింగ్ బౌలింగ్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ సైతం గాయాలతో జట్టుకు దూరమయ్యారని, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ సైతం శస్త్రచికిత్స వరకూ వెళ్లాల్సి వచ్చిందని ..ఇదంతా ఎందుకు జరుగుతోందంటూ కపిల్ నిలదీశారు.

మ్యాచ్ ప్రాక్టీసే కీలకం..

క్రికెటర్లకు మ్యాచ్ ప్రాక్టీసును మించినది మరొకటి లేదని, ప్రధానంగా ఫాస్ట్ , స్వింగ్ బౌలర్లకు నెట్ ప్రాక్టీసు, మ్యాచ్ ప్రాక్టీసు ఊపిరిలాంటిదని, నెట్ ప్రాక్టీస్ సమయంలో ఎన్ని ఓవర్లు ఎక్కువగా వేస్తే..అంత నియంత్రణస బౌలింగ్ పై పట్టు దొరుకుతుందని, పైగా ఫిట్ నెస్ సైతం మెరుగవుతుందని కపిల్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుత తరం క్రికెటర్లకు ఉన్న అత్యాధునిక శిక్షణ, సదుపాయాలు, ప్రత్యేక శిక్షకులు తమకాలంలో లేరని, తాము నెట్ ప్రాక్టీసులో గంటల తరబడి పాల్గొనడం, సాధన చేయడం ద్వారా మ్యాచ్ ఫిట్ నెస్ తో ఉండేవారమని కపిల్ తెలిపారు.

16 సంవత్సరాల కెరియర్ లో గాయం లేదా ఫిట్ నెస్ సమస్యలతో తాను ఎప్పుడూ జట్టుకు దూరం కాలేదని 100కు పైగా టెస్టులు, 400కు పైగా వికెట్లు పడగొట్టిన అనుభవం ఉన్న కపిల్ గుర్తు చేశారు.

ఐపీఎల్ తో అసలుకే మోసం.....

తమ రోజుల్లో టెస్టు సిరీస్ లు, వన్డే సిరీస్ లు మాత్రమే ఉండేవని, విదేశీపర్యటనలు సైతం చాలా తక్కువగా ఉండేవని..ముక్కోణపు సిరీస్ ల్లో ఎక్కువగా పాల్గొంటున్నా తమ ఆటతీరు నిలకడగా ఉండేదని తెలిపారు.

ప్రస్తుతం ఏటా జరిగే టీ-20 లీగ్ ఫాస్ట్ బౌలర్లపాలిట శాపంగా మారిందని, గాయాలతో తమతమ కెరియర్ లకే ముప్పు తెచ్చుకొంటున్నారని, కేవలం సంపాదన కోసమే క్రికెట్ ఆడుతూ ఉంటే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని చెప్పుకొచ్చారు.

వివిధ దేశాలు, భిన్నవాతావరణాలు, రకరకాల గ్రౌండ్లలో మ్యాచ్ లు ఆడాలంటే ఫాస్ట్ బౌలర్లు సూపర్ ఫిట్ గా ఉండాలని, ఫాస్ట్ బౌలింగ్ బాధ్యత అత్యంత శ్రమ, సవాలు, నేర్పుఓర్పులతో కూడుకొన్నదని కపిల్ వివరించారు.

నెట్ ప్రాక్టీసు సమయంలో బౌలర్లు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంతమేలు జరుగుతుందని, ప్రస్తుత తరం బౌలర్లు కేవలం 5 ఓవర్లు లేదా 30 బంతులతో ప్రాక్టీసు ముగించేయటమే ఫిట్ నెస్ సమస్యలకు అసలు కారణమని తెలిపారు.

First Published:  5 Feb 2023 9:16 AM GMT
Next Story