Telugu Global
Sports

లేటు వయసులో ఘాటైన రికార్డుల భారతటెన్నిస్ స్టార్!

ప్రపంచ పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత ఎవర్ గ్రీన్ స్టార్ రోహన్ బొపన్న తనదైన శైలిలో అరుదైన విజయాలతో అసాధారణ రికార్డులతో తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు...

లేటు వయసులో ఘాటైన రికార్డుల భారతటెన్నిస్ స్టార్!
X

లేటు వయసులో ఘాటైన రికార్డుల భారతటెన్నిస్ స్టార్!

ప్రపంచ పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత ఎవర్ గ్రీన్ స్టార్ రోహన్ బొపన్న తనదైన శైలిలో అరుదైన విజయాలతో అసాధారణ రికార్డులతో తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు...

అంతర్జాతీయ టెన్నిస్ లో..అదీ పురుషుల ప్రొఫెషనల్ టెన్నిస్ లో విజయాలు, అరుదైన రికార్డులు సాధించాలంటే వయసు ఏమాత్రం అవరోధం కాదని భారత వెటరన్ స్టార్ రోహన్ బొపన్న పదేపదే నిరూపిస్తూ వస్తున్నాడు.

43 సంవత్సరాల లేటు వయసులో గ్రాండ్ స్లామ్ టోర్నీలలో రన్నరప్ ట్రోఫీలతో పాటు..ఏటీపీ మాస్టర్స్ -1000 టోర్నీలలో సైతం విజేతగా నిలువగలనని భారత డేవిస్ కప్ డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొపన్న మరోసారి చాటి చెప్పాడు.

2023 సీజన్లో డబుల్‌ ధమాకా!

15 సంవత్సరాల చిరుప్రాయంలోనే టెన్నిస్ లో అడుగుపెట్టిన రోహన్ బొపన్న గత 28 సంవత్సరాలుగా కాలానికి ఎదురీదుతూ, ఏడాది ఏడాదికీ మీదపడుతున్న వయసును జయిస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు.

ప్రధానంగా పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ లో అరుదైన రికార్డులు సాధిస్తూ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.

ప్రస్తుత 2023 సీజన్ గ్రాండ్ స్లామ్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ లో మరో వెటరన్ సానియా మీర్జాతో జంటగా పోటీకి దిగి ఫైనల్స్ కు అర్హత సంపాదించాడు.చివరకు సానియాతో కలసి రన్నరప్ ట్రోఫీ అందుకొన్నాడు.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ చరిత్రలో ఫైనల్స్ చేరిన పెద్దవయస్కులైన జోడీగా రోహన్- సానియాజోడీ రికార్డుల్లో చేరారు. 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ ఫైనల్స్ లో పోటీకి దిగిన రోహన్ వయసు 42 సంవత్సరాలు కాగా..సానియా వయసు 36 సంవత్సరాలుగా ఉంది.

సానియా 16 సంవత్సరాల వయసున్నప్పుడు..20 సంవత్సరాల రోహన్ బొపన్నతో జంటగా తన తొలి మిక్సిడ్ డబుల్స్ టోర్నీ లో పాల్గొనడం విశేషం. అంతేకాదు..తన రిటైర్మెంట్ టోర్నీని సైతం రోహన్ తో కలిసే ఆడి రన్నరప్ ట్రోఫీ అందుకోడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

43 ఏళ్ల వయసులోనూ అదేజోరు...

అంతేకాదు..గత కొద్దివారాల క్రితమే 43వ పడిలో ప్రవేశించిన రోహన్ 2023 ఇండియన్స్ వెల్స్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ను ఆస్ట్ర్రేలియాకు చెందిన 35 సంవత్సరాల మాట్ ఇబ్ డెన్ తో కలసి గెలుచుకోడం ద్వారా సంచలనం సృష్టించాడు.

ప్రొఫెషనల్ టెన్నిస్ సర్క్క్యూట్ లో ఏటీపీ మాస్టర్స్ 1000 హోదా కలిగిన బీఎన్ పీ పరిబాస్ (ఇండియన్ వెల్స్ ) టోర్నీ టైటిల్ సమరంలో టాప్ సీడింగ్ జోడీ వెస్లీ కూల్ హాప్- నీల్ స్కుప్ స్కీలపై 6-3, 2-6, 10-8తో రోహన్ జోడీ విజయం సాధించడం ద్వారా విజేతలుగా నిలిచారు.

2015 సీజన్లో కెనడా ఆటగాడు డేనియల్ నెస్టర్ 42 సంవత్సరాల ప్రాయంలో సిన్ సినాటీ మాస్టర్స్ టైటిల్ నెగ్గడం ద్వారా రికార్డు నెలకొల్పితే..43 సంవత్సరాల వయసులో రోహన్ బొపన్న అదే ఘనత సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇండియన్స్ వెల్స్ టోర్నీలో తాను గత కొద్ది సంవత్సరాలుగా పాల్గొంటూ వచ్చినా విజేతగా నిలువలేకపోయానని..అందని ద్రాక్షలా ఊరిస్తూ వచ్చిన ఆ టైటిల్ ను మాట్ తో జంటగా అందుకోడం తనకు సంతృప్తినిచ్చిందని విజయానంతరం రోహన్ ప్రకటించాడు.

34 సంవత్సరాల రోహన్ బొపన్న కెరియర్ లో ఇది 5వ మాస్టర్స్ -1000 టైటిల్ కావడం అరుదైన ఘనతగా మిగిలిపోతుంది. 2017లో మోంటే కార్లో డబుల్స్ టైటిల్ నెగ్గిన తరువాత రోహన్ బొపన్న గెలుచుకొన్న తొలి టైటిల్ ఇండియన్ వెల్స్ కావడం విశేషం.

మూడుదశాబ్దాల తన టెన్నిస్ కెరియర్ లో రోహన్ బొపన్న గెలుచుకొన్న 24వ టూర్ ట్రోఫీ ఇదే కావడం మరో రికార్డు.

ప్రస్తుత టోర్నీ క్వార్టర్స్ లో ఫెలిక్స్ అగుర్- డెనిస్ షపలోవ్, సెమీఫైనల్లో జాన్ ఇస్నర్- జాక్ సాక్ లాంటి అగ్రశ్రేణి జట్ల ను ఓడించిన రోహన్- మాట్ ..చివరకు టైటిల్ సమరంలో సైతం మూడుసెట్ల హోరాహోరీ పోరులో విజేతలుగా నిలువగలిగారు.

తన కెరియర్ లో అత్యుత్తమంగా ప్రపంచ మూడో ర్యాంక్ సాధించిన రోహన్ బొపన్న ప్రస్తుత ఈ విజయంతో 11వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.



First Published:  19 March 2023 11:43 AM GMT
Next Story