Telugu Global
Sports

ప్రపంచకప్ ఫైనల్స్ రోజున మరో అరుదైన రికార్డు!

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాలలోనూ సరికొత్త రికార్డు నమోదయ్యింది. భారత్- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ ను ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సంఖ్యలో వీక్షించారు.

ప్రపంచకప్ ఫైనల్స్ రోజున మరో అరుదైన రికార్డు!
X

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాలలోనూ సరికొత్త రికార్డు నమోదయ్యింది. భారత్- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ ను ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సంఖ్యలో వీక్షించారు...

బార్బడోస్ రాజధాని బ్రిడ్జి టౌన్ వేదికగా..కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగిన టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ ప్రత్యక్ష ప్రసారాలలోనూ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైనట్లు బ్రాడ్ కాస్టర్ డిస్నీ, హాట్ స్టార్ సంస్థలు ప్రకటించాయి.

80 దేశాలలో ప్రత్యక్ష ప్రసారం...

అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో నెలరోజులపాటు 55 మ్యాచ్ లుగా సాగిన 9వ ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలలో ప్రత్యక్షప్రసారానికి అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ నెట్ వర్క్ ఏర్పాట్లు చేసింది.

అమెరికా, ఇంగ్లండ్, కరీబియన్ ద్వీపదేశాలతో పాటు..ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలు, భారత ఉపఖండ దేశాలలో క్రికెట్ అభిమానులు విపరీతంగా ఉన్నారు. వివిధ దేశాలలో వివిధ నెట్ వర్క్ లు ఈ ప్రత్యక్షప్రసారాలను అందించాయి.

ప్రధానంగా..140 కోట్ల జనాభా, కోట్లాదిమంది క్రికెట్ అభిమానులున్న భారత్ లో రాత్రి 8 గంటల సమయం నుంచి మ్యాచ్ ల ప్రత్యక్షప్రసారం ఉండటం బాగా కలసి వచ్చింది.

ఫైనల్స్ రోజున 5 కోట్ల 30 లక్షల వీక్షకులు..

జూన్ 29న భారత్- దక్షిణాఫ్రికా జట్ల నడుమ జరిగిన ఫైనల్స్ మ్యాచ్ ను వివిధ మాధ్యమాల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా 5 కోట్ల 30 లక్షల మంది వీక్షించినట్లు డిస్నీ-స్టార్ నెట్ వర్క్ అధికారికంగా ప్రకటించింది.

ఆట ప్రారంభం నుంచి విజేతగా భారత్ ట్రోఫీ అందుకొనే వరకూ గత ఎనిమిది ప్రపంచకప్ టోర్నీలకు మించి ప్రస్తుత 9వ ప్రపంచకప్ లో5 కోట్ల 30 లక్షల మంది చూసినట్లు డిస్నీ-హాట్ స్టార్ ప్రతినిధి సజిత్ శివానందన్ తెలిపారు.

కోట్లాదిమందికి సంతోషం కలిగించిన ఈ ప్రత్యక్షప్రసారాలను చేసే అవకాశం తమ నెట్ వర్క్ కే దక్కడం అదృష్టమని, ప్రత్యేకంగా భారత క్రికెట్ అభిమానులకు రుణపడి ఉంటామని చెప్పారు.

17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత భారత్ టీ-20 ప్రపంచకప్ ను కైవసం చేసుకొన్న క్షణాలను చూసి కోట్లాదిమంది అభిమానులు పులకించిపోడం తమకు గర్వకారణమని అన్నారు.

2013లో చివరిసారిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొన్న భారత్..11 ఏళ్ల తరువాత మరో ఐసీసీ టైటిల్ అందుకోడం విశేషం.

1983, 2011 సంవత్సరాలలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ టైటిల్స్, 2007, 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన భారత్..సాంప్రదాయ టెస్టు క్రికెట్ లీగ్ లో మాత్రం వరుసగా రెండుసార్లు రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

First Published:  1 July 2024 1:02 PM GMT
Next Story