Telugu Global
Sports

భారత్- పాక్ మ్యాచ్ రద్దయితే 581కోట్ల నష్టం!

విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్న భారత్- పాక్ జట్ల ప్రపంచకప్ మ్యాచ్ వేళ వర్షం కారణంగా రద్దయితే 581కోట్ల రూపాయల మేర నష్టం జరుగనుంది.

భారత్- పాక్ మ్యాచ్ రద్దయితే 581కోట్ల నష్టం!
X

విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్న భారత్- పాక్ జట్ల ప్రపంచకప్ మ్యాచ్ వేళ వర్షం కారణంగా రద్దయితే 581కోట్ల రూపాయల మేర నష్టం జరుగనుంది. ఈరోజు జరుగనున్న ఈ సూపర్ సండే ఫైట్ కు 90 శాతం వరకూ వానదెబ్బ పడనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.

ప్రపంచకప్ సూపర్ -12 ..గ్రూపు-2 తొలిరౌండ్ పోరుకు ఓవైపు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ సై అంటే సై అంటుంటే..మరోవైపు వరుణదేవుడు భయపెడుతున్నాడు.

మ్యాచ్ కు వేదికగా ఆతిథ్యమిస్తున్న మెల్బో్ర్న్ నగరంలో గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా పేరున్న మెల్బో్ర్న్ స్టేడియంలో లక్షమంది ఏకకాలంలో కూర్చొని మ్యాచ్ చూసే ఏర్పాట్లు ఉన్నాయి. అయితే...భారత్- పాక్ జట్ల మెగా సమరానికి 80వేల మంది అభిమానులు హాజరుకానున్నట్లు నిర్వాహక సంఘం చెబుతోంది. మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.

భయపెడుతున్న వరుణుడు,,

భారత్- పాక్ జట్ల మ్యాచ్ జరిగే సమయంలో మెల్బోర్న్ స్టేడియం 100 శాతం మేఘావృతమై ఉంటుందని, 90 శాతం వరకూ వర్షం పడటం ఖాయమని వాతావరణశాఖ తాజాగా హెచ్చరించింది.

శుక్రవారం నుంచి మెల్బో్ర్న్ లో కుండపోతగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని, మ్యాచ్ కు 90 శాతం అంతరాయం కలగడం ఖాయమని వాతావరణశాఖ చెప్పడంతో నిర్వాహక సంఘంతో పాటు..కోట్లాదిమంది అభిమానుల ఉత్సాహం పై నీళ్లు చల్లినట్లయ్యింది.

భయపెడుతున్న భారీనష్టం...

ఒకవేళ ఒక్కబంతీ పతికుండా మ్యాచ్ రద్దైతే వివిధ రూపాలలో 70 మిలియన్ డాలర్లు ( 581 కోట్ల రూపాయలు ) మేర నష్టపోక తప్పదని నిర్వాహక సంఘం, బ్రాడ్ కాస్టర్లు భయపడుతున్నారు.

ఈమ్యాచ్ కు ఆన్ లైన్ లో విక్రయించిన టికెట్లు కొద్దివారాల క్రితమే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అసలుమ్యాచ్ జరుగకపోతే అభిమానులకు టికెట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంది.

కట్టుదిట్టైమైన ఏర్పాట్లు...

మెల్బోర్న్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలో మినహా..మిగిలిన సమయంలో కుండపోతగా వానపడినా మ్యాచ్ నిర్వహించడానికి తగిన ఏర్పాట్లున్నాయి. గ్రౌండ్లో నిలిచిన వాన నీరు కొద్ది నిముషాల్లోనే భూమిలోకి ఇంకిపోయేలా అత్యుత్తమ డ్రైనేజీ ఏర్పాట్లున్నాయి. అవుట్ ఫీల్డ్ మొత్తం కప్పి ఉంచడానికి అవసరమైన కవర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

మ్యాచ్ జరిగే సమయంలో మాత్రం వానపడకుండా ఉంటే చాలునని నిర్వాహక సంఘం ఆశపడుతోంది. భారత్, పాక్ దేశాలతో పాటు వివిధ దేశాలలోని క్రికెట్ అభిమానులు మాత్రం పూర్తిగా 40 ఓవర్లతో మ్యాచ్ జరగాలనీ, ఒకరోజు ముందుగానే దీపావళి వేడుకను ఈ క్రికెట్ పటాకా ద్వారా జరుపుకోవాలని ఆశపడుతున్నారు.

First Published:  23 Oct 2022 3:45 AM GMT
Next Story