Telugu Global
Sports

SRH బ్యాటింగ్‌... రికార్డులన్నీ బ్రేకింగ్..

ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో సన్ రైజర్స్ 2.0 వర్షన్ కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లకు సన్‌రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు.

SRH బ్యాటింగ్‌... రికార్డులన్నీ బ్రేకింగ్..
X

ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో సన్ రైజర్స్ 2.0 వర్షన్ కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లకు సన్‌రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాలను మోతెక్కిస్తున్నారు. ఈ సీజన్‌లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్లను నమోదు చేసిన ఆ జట్టు.. తాజాగా మరో భారీ స్కోరు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 266 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ 67 పరుగుల తేడాతో గెలిచింది. అయితే న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా రికార్డులు బద్దలయ్యాయి.

IPL చరిత్రలోనే ఏకైక టీమ్‌..

ఐపీఎల్‍లో మూడుసార్లు 250కు పైగా పరుగులు చేసిన ఏకైక ఐపీఎల్ జట్టుగా సన్‍రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. మూడుసార్లు ఇదే సీజన్‍లో ఈ ఫీట్ సాధించింది. ఈ సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టుపై 277 రన్స్ చేసిన హైదరాబాద్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులు చేసింది. శనివారం ఢిల్లీతో మ్యాచ్‍లో 266 రన్స్ చేసింది.

పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు..

గత మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే 89 పరుగులు బాదాడు. యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 46 పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 38 బంతుల్లోనే 131 పరుగులు చేశారు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలోనే పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిలిచింది.

IPLలో వేగంగా 100 పరుగులు..

1. ఢిల్లీపై సన్‌రైజర్స్ - 5 ఓవర్లు (2024)

2. పంజాబ్‌పై చెన్నై - 6 ఓవర్లు (2014)

3. ఆర్సీబీపై కోల్‌కతా - 6 ఓవర్లు (2017)

సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ..

1. ఢిల్లీపై ట్రావిస్ హెడ్ - 16 బంతులు ( 2024)

2. ముంబైపై అభిషేక్ శర్మ - 16 బంతులు (2024)

3. ముంబైపై ట్రావిస్ హెడ్ - 18 బంతులు (2024)

IPL ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు

1. ఢిల్లీపై సన్‌రైజర్స్ - 22 (2024)

2. ఆర్సీబీపై సన్‌రైజర్స్ - 22 (2024)

3. పుణేపై ఆర్సీబీ -21 (2013)

IPL మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు

1. ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ - 81 (2024)

2. సన్‌రైజర్స్ వర్సెస్ ఢిల్లీ - 71 (2024)

3. సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై - 69 (2024)

పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్ చేసిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు

1. ఢిల్లీపై ట్రావిస్ హెడ్ - 84 (26)

2. కోల్‌కతాపై - డేవిడ్ వార్నర్ - 62*(25) -(2019)

3. ముంబైపై ట్రావిస్ హెడ్ - 59*(20) -( 2024)

First Published:  21 April 2024 10:53 AM GMT
Next Story