Telugu Global
Sports

ఆస్ట్ర్రేలియాతో నేడు భారత్ టైటిల్ సమరం

మలేసియా వేదికగా జరుగుతున్నసుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ అంతర్జాతీయ జూనియర్ హాకీ టైటిల్ సమరంలో దిగ్గజజట్లు ఆస్ట్ర్రేలియా, భారత్ ఢీ కొనున్నాయి జోహార్ బాహ్రూ ఆస్ట్ర్రోటర్ఫ్ స్టేడియం వేదికగా ఫైనల్స్ ఈరోజు జరుగనుంది.

ఆస్ట్ర్రేలియాతో నేడు భారత్ టైటిల్ సమరం
X

మలేసియా వేదికగా జరుగుతున్నసుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ అంతర్జాతీయ జూనియర్ హాకీ టైటిల్ సమరంలో దిగ్గజజట్లు ఆస్ట్ర్రేలియా, భారత్ ఢీ కొనున్నాయి జోహార్ బాహ్రూ ఆస్ట్ర్రోటర్ఫ్ స్టేడియం వేదికగా ఫైనల్స్ ఈరోజు జరుగనుంది.

ప్రపంచకప్ జూనియర్ హాకీ పోటీలకు భారత కుర్రాళ్ల సన్నాహాలు జోరందుకొన్నాయి. మలేసియాలోని జోహార్ బాహ్రూ వేదిక జరుగుతున్న జోహార్ కప్ అంతర్జాతీయ హాకీ టోర్నీ ఫైనల్స్ కు భారత్ చేరుకొంది. టైటిల్ సమరంలో పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

బ్రిటన్ ను నిలువరించడంతో ఫైనల్ బెర్త్...

గ్రేట్ బ్రిటన్ తో జరిగిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ పోటీని 5-5 గోల్స్ తో డ్రాగా ముగించడం ద్వారా భారత్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

ఆట ముగిసే క్షణాల వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ తరపున పూవన్న, అమన్ దీప్, అర్జీత్ సింగ్ తలో గోలు, షరద్ నంద తివారీ 2 గోల్సు సాధించారు.

గ్రేట్ బ్రిటన్ ఆటగాళ్లలో మాక్స్ యాండర్సన్ , జామీ గోల్డెన్ చెరో రెండుగోల్స్, హారిసన్ స్టోన్ ఓ గోలు సాధించారు. మ్యాచ్ ను 5-5 గోల్స్ తో డ్రాగా ముగించడంతో భారత్ లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలవడం ద్వారా ఫైనల్ కు చేరుకొంది.

మరో ఆఖరిరౌండ్ పోరులో ఆస్ట్ర్రేలియా 6-1 గోల్స్ తో దక్షిణాఫ్రికాను చిత్తు చేయడం ద్వారా 13 పాయింట్లతో ఆరుజట్ల లీగ్ టేబుల్ టాపర్ గా ఫైనల్లో అడుగుపెట్టింది.

గ్రేట్ బ్రిటన్, జపాన్ చెరో 7 పాయింట్లు, దక్షిణాఫ్రికా 6 పాయింట్లు, ఆతిథ్య మలేసియా ఒకే ఒక్కపాయింటుతో లీగ్ టేబుల్ ఆఖరిస్థానంలో నిలిచాయి.

రౌండ్ రాబిన్ లీగ్ లో ఆస్ట్ర్రేలియాను 5-5 గోల్సుతో నిలువరించిన భారత్ మరోసారి అదేజట్టుతో టైటిల్ సమరంలో ఢీ కొననుంది.

లీగ్ దశలో భారత్ ఆతిథ్య మలేసియాను 5-2 గోల్స్ తో చిత్తు చేసినా..దక్షిణాఫ్రికా చేతిలో 4-5 గోల్స్ తో పరాజయం చవిచూడక తప్పలేదు. ఆ తర్వాతి రౌండ్లో జపాన్ ను 5-1 గోల్స్ తో ఓడించిన భారత్ ఆఖరి రౌండ్లో గ్రేట్ బ్రిటన్ తో 5-5 స్కోరుతో సమఉజ్జీగా నిలువగలిగింది.

ఆరుజట్ల లీగ్ లో మొదటి రెండు అత్యుత్తమజట్లే చివరకు టైటిల్ సమరానికి అర్హత సంపాదించగలిగాయి.

First Published:  29 Oct 2022 3:45 AM GMT
Next Story