Telugu Global
Sports

సూర్యా సునామీలో శ్రీలంక గల్లంతు!

టీ-20 టాప్ ర్యాంకర్ భారత్ కొత్త సంవత్సరంలో తొలి సిరీస్ ను అలవోకగా గెలుచుకొంది. మిస్టర్- 360 సూర్యకుమార్ సునామీ సెంచరీతో భారత్ 91 పరుగులతో శ్రీలంకను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకొంది.

సూర్యా సునామీలో శ్రీలంక గల్లంతు!
X

సూర్యా సునామీలో శ్రీలంక గల్లంతు!

టీ-20 టాప్ ర్యాంకర్ భారత్ కొత్త సంవత్సరంలో తొలి సిరీస్ ను అలవోకగా గెలుచుకొంది. మిస్టర్- 360 సూర్యకుమార్ సునామీ సెంచరీతో భారత్ 91 పరుగులతో శ్రీలంకను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకొంది....

ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్ 2023లో తొలి సిరీస్ విజయంతో బోణీ కొట్టింది. టీ-20ల్లో 8వ ర్యాంకర్ శ్రీలంకను 2-1తో ఓడించడం ద్వారా మూడుమ్యాచ్ ల సిరీస్ ను 2-1తో సొంతం చేసుకొంది.

రాజ్ కోట వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి పోరులో భారత్ 91 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

రాజ్ కోట రాజా సూర్యకుమార్ యాదవ్....

మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని తొలిమ్యాచ్ ను భారత్ 2 పరుగులతో సొంతం చేసుకొంటే..రెండోమ్యాచ్ లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. దీంతో సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరిమ్యాచ్ కీలకంగా మారింది.

రాజకోట లోని సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడవ, ఆఖరిపోరులో కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్కపరుగుకే అవుట్ కాగా..మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 46, వన్ డౌన్ రాహుల్ త్రిపాఠీ 35 పరుగులతో స్కోరుబోర్డును పరుగులెత్తించారు.

ఇక....రెండోడౌన్ లో బ్యాటింగ్ కు దిగిన వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చిరావడంతోనే శ్రీలంక బౌలర్లపై విరుచుకు పడ్డాడు.

సిక్సర్లు, బౌండ్రీల వర్షం..

ఆట 8వ ఓవర్లోనే సూర్య గేరు మార్చాడు. గ్రౌండ్ నలుమూలలకూ తన ట్రేడ్ మార్క్ ర్యాంప్, లాఫ్టెడ్, ఫ్లిక్, కట్ షాట్లతో చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దు అన్నట్లుగా బౌండ్రీలు, సిక్సర్లతో శివమెత్తిపోయాడు.

కేవలం 45 బాల్స్ లోనే టీ-20ల్లో తన మూడోశతకం పూర్తి చేసిన సూర్య...51 బాల్స్ లో 7 బౌండ్రీలు, 9 సిక్సర్లతో 112 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 9 బంతుల్లో 4 బౌండ్రీలతో 21 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో భారత్ 5 వికెట్లకు 218 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.

శ్రీలంక బౌలర్లలో మధుశంక 2 వికెట్లు, రజత, కరుణరత్నే, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.

శ్రీలంక టపటపా....

మ్యాచ్ నెగ్గాలంటే 219 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన శ్రీలంక ప్రారంభ ఓవర్లలోనే మూడుటాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. రెండోటీ-20లో బ్యాట్ ఝళిపించిన టాపార్డర్ బ్యాటర్లంతా తక్కువ స్కోర్లే వెనుదిరిగారు. కేవలం ఐదుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించినా భారీస్కోర్లుగా మలచుకోలేకపోయారు. చివరకు శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలిపోయింది.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, చహాల్ , పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. టాప్ ర్యాంకర్ భారత్ 91 పరుగుల భారీవిజయంతో 2-1 తేడాతో సిరీస్ విజేతగా నిలువగలిగింది.

శ్రీలంక ప్రత్యర్థిగా స్వదేశీ గడ్డపై ఆడిన గత 14 టీ-20 మ్యాచ్ ల్లో భారత్ కు ఇది 11వ విజయం కాగా..మూడో సిరీస్ గెలుపు. కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా కు ఇది వరుసగా మూడో సిరీస్ గెలుపు.

First Published:  8 Jan 2023 4:43 AM GMT
Next Story