Telugu Global
Sports

విన్నర్ సిన్నర్...ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో జోకో ఆధిపత్యానికి తెర!

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కింగ్ నొవాక్ జోకోవి్చ్ ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. సెమీఫైనల్లోనే జోకోవిచ్ టైటిల్ వేట ముగిసింది.

విన్నర్ సిన్నర్...ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో జోకో ఆధిపత్యానికి తెర!
X

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కింగ్ నొవాక్ జోకోవి్చ్ ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. సెమీఫైనల్లోనే జోకోవిచ్ టైటిల్ వేట ముగిసింది. జోకో ప్రత్యర్థిగా ఇటలీ ఆటగాడు సిన్నర్ సంచలన విజయం సాధించాడు...

2024 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ఆస్ట్ర్రేలియన్ కింగ్, 10సార్లు విజేత నొవాక్ జోకోవిచ్ ను సెమీఫైనల్లోనే ఇటలీకి చెందిన 4వ సీడ్ ఆటగాడు యానిక్ సిన్నర్ కంగు తినిపించాడు.

33 విజయాలకు గండి....

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనాలో జోకోవిచ్ 33 వరుస విజయాలకు, జైత్రయాత్రకు యువఆటగాడు సిన్నర్ సస్తి పలికాడు. పదునైన సెర్వ్ కు అగ్గిపిడుగులాంటి గ్రౌండ్ స్ట్రోక్ లను జోడించి టాప్ సీడ్ జోకోవిచ్ ను నాలుగుసెట్ల పోరులో చిత్తు చేశాడు.

మొదటి రెండుసెట్లను 6-1, 6-2తో అలవోకగా గెలుచుకొన్న సిన్నర్ మూడోసెట్ ను టై బ్రేక్ లో 6-7తో చేజార్చుకొన్నా..నిర్ణయాత్మక నాలుగో సెట్ ను 6-3తో నెగ్గడం ద్వారా తన కెరియర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టాడు.

టైటిల్ సమరంలో డేనిల్ మెద్వదేవ్ తో సిన్నర్ అమీతుమీ తే్ల్చుకోనున్నాడు.

కల చెదిరిన 25వ టైటిల్ వేట..

గ్రాండ్ స్లామ్ టె్న్నిస్ చరిత్రలో అత్యధికంగా 24 టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ 25వ టైటిల్ కల ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ఓటమితో చెదిరిపోయింది. మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో 10 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటి్‌ల్స్ ఉన్నాయి.

2018 నుంచి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో ఓటమి అంటే ఏమిటో ఎరుగని జోకోవిచ్ ను 22 సంవత్సరాల సిన్నర్ మట్టికరిపించాడు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడే 36 సంవత్సరాల జోకోవిచ్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. గత ఆరేళ్ల కాలంలో జోకోవిచ్ ఇంత చెత్తగా ఆడటం ఇదే మొదటిసారి.

ఆదివారం జరిగే టైటిల్ సమరంలో 3వ సీడ్ డేనిల్ మెద్వదేవ్ నుంచి 6వ సీడ్ యానిక్ సిన్నర్ కు గట్టిపోటీ ఎదురుకానుంది.

పురుషుల డబుల్స్ లో రోహన్ బొపన్న- మాథ్యూ ఇబెడెన్ జోడీ తమ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీపడనున్నారు.

First Published:  27 Jan 2024 5:50 AM GMT
Next Story