Telugu Global
Sports

పాండ్యా వ‌చ్చేయ‌డం ఖాయ‌మేన‌ట‌.. త‌ప్పుకోవాల్సింది అయ్య‌రేనా?

ఆరు మ్యాచ్‌ల్లో అవ‌కాశ‌మిచ్చినా అతను ప‌ట్టుమ‌ని 150 ప‌రుగులు కూడా చేయ‌లేదు. సో.. పాండ్యా వ‌స్తే ప‌క్క‌కు త‌ప్పుకునేది శ్రేయ‌స్ అయ్య‌రే అంటున్నారు.

పాండ్యా వ‌చ్చేయ‌డం ఖాయ‌మేన‌ట‌.. త‌ప్పుకోవాల్సింది అయ్య‌రేనా?
X

శ్రీలంకతో జ‌రిగిన‌ మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అత‌ను వేగంగా కోలుకుంటున్నాడ‌ని, కీల‌క మ్యాచ్‌ల‌కు అందుబాటులోకి వ‌స్తాడ‌ని చెబుతున్నారు. హార్దిక్ పునరాగమనం చేస్తే జట్టు నుంచి తప్పుకోవాల్సింది ఎవ‌ర‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. అయితే దీనికి స‌మాధానం కూడా చాలా సులువు అంటున్నారు క్రీడా విశ్లేష‌కులు.. ఆ స‌మాధానం శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఆరు మ్యాచ్‌ల్లో అవ‌కాశ‌మిచ్చినా అతను ప‌ట్టుమ‌ని 150 ప‌రుగులు కూడా చేయ‌లేదు. సో.. పాండ్యా వ‌స్తే ప‌క్క‌కు త‌ప్పుకునేది శ్రేయ‌స్ అయ్య‌రే అంటున్నారు.

అయ్య‌ర్ తేలిపోయాడు

హార్ధిక్ పాండ్యా టీమ్‌లో ఉన్న‌ప్పుడు కూడా స్పెష‌లిస్ట్ బ్యాట్స్‌మ‌న్‌గా, మిడిలార్డ‌ర్‌లో కీల‌కంగా శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను తీసుకున్నారు. మిడిల్ ఆర్డ‌ర్‌గా అత‌డి రికార్డు బాగుండ‌టంతో, గాయాల‌బారిన పడినా కూడా వేచి చూసి మ‌రీ బీసీసీఐ వ‌ర‌ల్డ్ క‌ప్ జట్టులో చోటిచ్చింది. కానీ అయ్య‌ర్ తేలిపోయాడు. టోర్నీలో ఇండియా ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ అయ్య‌ర్ చేసింది ఏమీ లేదు. 22.33 సగటుతో 134 పరుగులు మాత్ర‌మే చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చేసిన 53 ప‌రుగులే అత్య‌ధికం. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో జట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు వచ్చి అత‌ను మూడు ప‌రుగుల‌కే ఔట‌య్యాడు.

సూర్యాభాయ్ సేఫ్‌!

మరోవైపు హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్ పూర్తి స్థాయిలో ఉప‌యోగించుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కీలక బ్యాట్స్‌మెన్స్ విఫలమైన చోట 49 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దూకుడుగా కాకుండా జ‌ట్టు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు ఆడి విలువైన ప‌రుగులు జోడించాడు. టాప్ ఆర్డ‌ర్ బాగా ఆడితే చివ‌ర్లో వ‌చ్చి పిచ్చ‌కొట్టుడు కొట్ట‌డంతో సూర్య ఎలాగూ స్పెష‌లిస్టే. కాబ‌ట్టి ఎలా చూసినా పాండ్యా వ‌స్తే సూర్య‌ను ఉంచి శ్రేయ‌స్‌ను పక్క‌న‌పెట్ట‌డ‌మే మేలంటున్నారు. మ‌రి టీమ్ మేనేజ్‌మెంట్ ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో!


First Published:  31 Oct 2023 6:53 AM GMT
Next Story