Telugu Global
Sports

ప్రపంచ రికార్డుకు 2 పరుగుల దూరంలో రోహిత్- విరాట్ జోడీ!

భారత సూపర్ స్టార్ జోడీ రోహిత్ శర్మ- విరాట్ కొహ్లీలను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఈ ఇద్దరి భాగస్వామ్యం అరుదైన రికార్డుకు కేవలం 2 పరుగుల దూరంలో నిలిచింది.

Rohit Sharma-Virat Kohli: ప్రపంచ రికార్డుకు 2 పరుగుల దూరంలో రోహిత్- విరాట్ జోడీ!
X

ప్రపంచ రికార్డుకు 2 పరుగుల దూరంలో రోహిత్- విరాట్ జోడీ!

భారత సూపర్ స్టార్ జోడీ రోహిత్ శర్మ- విరాట్ కొహ్లీలను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఈ ఇద్దరి భాగస్వామ్యం అరుదైన రికార్డుకు కేవలం 2 పరుగుల దూరంలో నిలిచింది....

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది. విజేతను నిర్ణయించే ఆఖరి పోరుకు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా నిలిచింది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో రెండుజట్లూ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో..ఈ ఆఖరిమ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.

ఇటు రోహిత్- అటు విరాట్!

వైట్ బాల్ క్రికెట్లో..అందున్నా 50 ఓవర్ల ఫార్మాట్లో భారత సూపర్ స్టార్ జోడీ రోహిత్ శర్మ- విరాట్ కొహ్లీల భాగస్వామ్యానికి ప్రత్యేక గుర్తింపే ఉంది. ఈ ఇద్దరు మొనగాళ్లు జంటగా ఇప్పటికే పలు కీలక భాగస్వామ్యాలతో భారత జట్టుకు పలు చిరస్మరణీయ విజయాలు అందించారు. ఈ క్రమంలోనే అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచారు.

ప్రస్తుత సిరీస్ లోని విశాఖ వన్డే వరకూ రోహిత్- విరాట్ జోడీ జంటగా 4వేల 988 పరుగులు జోడించడం ద్వారా తమకు తామే సాటిగా నిలిచారు.

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఆఖరి వన్డేలో రోహిత్-విరాట్ జంటగా మరో రెండు పరుగులు సాధించగలిగితే..వన్డే క్రికెట్ చరిత్రలోనే 5వేల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ప్రపంచ రికార్డు నెలకొల్పగలుగుతారు.

85 ఇన్నింగ్స్ లో 4వేల 998 పరుగులు...

గత పుష్కరకాలంలో రోహిత్- విరాట్ జంటగా ఆడిన మొత్తం 85 ఇన్నింగ్స్ లో 4998 పరుగులు సాధించగలిగారు. ప్రస్తుత సిరీస్ లోని ఆఖరి వన్డేలో ఈజోడీ మరో 2 పరుగులు సాధించగలిగితే...వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 5వేల పరుగుల మైలురాయిని చేరిన జంటగా ప్రపంచ రికార్డును అందుకోగలుగుతారు.

18 సెంచరీ భాగస్వామ్యాలు, 15 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలతో 62. 47 సగటు నమోదు చేయగలిగారు.

ఇప్పటి వరకూ వన్డేలలో అత్యంత వేగంగా 5వేల పరుగుల భాగస్వామ్యాన్ని 97 ఇన్నింగ్స్ లో నమోదు చేసిన ప్రపంచ రికార్డు కరీబియన్ జోడీ గార్డన్ గ్రీనిడ్జ్జ్ - డెస్మండ్ హేన్స్ పేరుతో ఉంది.

ఆ తర్వాతి స్థానాలలో కంగారూ జోడీ మాథ్యూహేడెన్- ఆడమ్ గిల్ క్రిస్ట్, శ్రీలంక జోడీ తిలకరత్నే దిల్షాన్- కుమార సంగక్కర ఉన్నారు. హేడెన్- గిల్ క్రిస్ట్ జంట 104, దిల్షాన్- సంగక్కర జంట 105 ఇన్నింగ్స్ లోనూ 5వేల పరుగుల రికార్డులు నమోదు చేశారు. ఈ రికార్డులను భారతజోడీ రోహిత్- విరాట్ 86 ఇన్నింగ్స్ లోనే అధిగమించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. వన్డే క్రికెట్లో 60 సగటు నమోదు చేసిన ఏకైకజోడీ రోహిత్- విరాట్ మాత్రమే.

అగ్రస్థానంలో సచిన్-సౌరవ్ జోడీ..

వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ జోడీగా సచిన్ టెండుల్కర్- సౌరవ్ గంగూలీల నిలిచారు. 8వేల 227 పరుగులు సాధించడం ద్వారా ఈ జంట అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అత్యధిక పరుగులు నమోదు చేసిన జంటల వరుసలో రోహిత్- విరాట్ 8వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ రెండోర్యాంకర్ ఆస్ట్ర్రేలియాపై ప్రస్తుత సిరీస్ ను 2-1తో కైవసం చేసుకోవాలంటే ఓపెనర్ గా రోహిత్, వన్ డౌన్ బ్యాటర్ గా విరాట్ అత్యుత్తమంగా రాణించి తీరక తప్పదు.

First Published:  22 March 2023 9:20 AM GMT
Next Story