Telugu Global
Sports

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బొపన్నజోడీ!

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ కు భారత ఆటగాడు రోహన్ బొపన్న- మాథ్యూ ఇబ్ డెన్ జోడీ తొలిసారిగా చేరింది. పురుషుల సింగిల్స్ లో నాలుగోరౌండ్ పోటీలు ముగింపు దశకు చేరాయి.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బొపన్నజోడీ!
X

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ కు భారత ఆటగాడు రోహన్ బొపన్న- మాథ్యూ ఇబ్ డెన్ జోడీ తొలిసారిగా చేరింది. పురుషుల సింగిల్స్ లో నాలుగోరౌండ్ పోటీలు ముగింపు దశకు చేరాయి.

2024- సీజన్ గ్రాండ్ స్లామ్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పోటీలు రెండవ వారానికే జోరందుకొన్నాయి. పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో పోరు క్వార్టర్ ఫైనల్స్ దశకు చేరింది.

భారత డబుల్స్ స్టార్, వెటరన్ ఆటగాడు రోహన్ బొపన్న, మాథ్యూ ఇబ్ డెన్ ల జంట నాలుగోరౌండ్ పోరులో గట్టి పోటీ ఎదుర్కొని క్వార్టర్ ఫైనల్స్ కు అర్హతసాధించింది.

'టై' బ్రేక్ వరకూ సాగిన పోరు..

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో రెండోసీడ్ జంట రోహన్ బొపన్న- మాథ్యూ ఇబెడన్ చెమటోడ్చి నెగ్గారు. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం జరిగిన ఈ హోరాహోరీ పోరులో 14వ సీడ్ వెస్లీ కూల్ హాఫ్- నికోలా మెక్టిచ్ ను బొపన్నజోడీ 7-6, 7-6తో టైబ్రేక్ విజయంతో అధిగమించగలిగారు.

సెమీఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో అర్జెంటీనాకు చెందిన 6వ సీడ్ జోడీ మాక్సిమో గోంజాలేజ్- యాండ్రెస్ మోల్టినీతో అమీతుమీ తేల్చుకోనున్నారు. బొపన్న జోడీ తమ కెరియర్ లో ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి.

క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకోడం ద్వారా 43 ఏళ్ల రోహన్ బొపన్న 2వ ర్యాంక్ ఖాయం చేసుకోగలిగాడు. పురుషుల డబుల్స్ రేస్ లో మిగిలిన అత్యధిక సీడింగ్ కలిగిన జట్టు రోహన్ - మాథ్యూలదే కావడం విశేషం.

క్వార్టర్స్ లో అల్ కరాజ్ కు జ్వేరేవ్ గండం...

పురుషుల సింగిల్స్ లో 2వ సీడ్ కార్లోస్ అల్ కరాజ్, 3వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ చేరుకొన్నారు. 4వ రౌండ్ పోరులో యంగ్ గన్ అల్ కరాజ్ 6-4, 6-4, 6-0తో మియోమిర్ కేస్మనోవిచ్ ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్ కు తొలిసారి అర్హత సాధించగలిగాడు.

సెమీఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో ఒలింపిక్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వేరేవ్ తో అల్ కరాజ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ప్రీ- క్వార్టర్ ఫైనల్లో 19వ సీడ్ కామెరాన్ నోరీని ఓడించడానికి జ్వేరేవ్ 4 గంటలపాటు పోరాడాల్సి వచ్చింది.అల్ కరాజ్- జ్వెరేవ్ ల పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

క్వార్టర్ ఫైనల్స్ చేరిన ఇతర సీడెడ్ స్టార్లలో యాండ్రీ రుబులేవ్ సైతం ఉన్నాడు.

టాప్ సీడ్ ఆటగాడు, 10 టైటిల్స్ విన్నర్ నొవాక్ జోకోవిచ్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా రోజర్ ఫెదరర్ 43 గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్ రికార్డును సమం చేయగలిగాడు.

First Published:  23 Jan 2024 6:47 AM GMT
Next Story