Telugu Global
Sports

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో జడేజా అప్, రాహుల్ డౌన్!

2023 సంవత్సరానికి బీసీసీఐ 26 మంది క్రికెర్లను వార్షిక కాంట్రాక్టుల ఇచ్చింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇచ్చి, కెఎల్ రాహుల్ ను డిమోట్ చేసింది.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో జడేజా అప్, రాహుల్ డౌన్!
X

2023 సంవత్సరానికి బీసీసీఐ 26 మంది క్రికెర్లను వార్షిక కాంట్రాక్టుల ఇచ్చింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇచ్చి, కెఎల్ రాహుల్ ను డిమోట్ చేసింది...

భారత క్రికెట్ బోర్డు 2023 సంవత్సరానికి క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను ఖరారు చేసింది. మొత్తం 26 మంది క్రికెటర్లను నాలుగు తరగతులుగా వార్షిక కాంట్రాక్టుల్లో ఉంచింది.

ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్, కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ లను తొలిసారిగా కాంట్రాక్టు జాబితాలో చేర్చింది.

7 కోట్ల రూపాయల జాబితాలో రవీంద్ర జడేజా...

క్రికెటర్ల ప్రదర్శనను బట్టి బీసీసీఐ ఏటా క్రికెట్ గ్రేడింగ్స్ ప్రకారం వార్షిక కాంట్రాక్టులను ఇస్తూ వస్తోంది. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాళ్లుగా ఉన్నవారికి..ఏడాదికి

(ఆడినా, ఆడకున్నా ) ఏ+ గ్రేడ్ ప్లేయర్లకు 7 కోట్ల రూపాయలు చొప్పున చెల్లిస్తోంది. గాయాలతో జట్టుకు దూరమైన ఈ మొత్తాన్ని గ్యారెంటీ మనీగా ఇస్తోంది.

ఏ- గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి 5 కోట్ల రూపాయలు, బీ- గ్రేడ్ క్రికెటర్లకు 3 కోట్ల రూపాయలు, సీ -గ్రేడ్ ఆటగాళ్లకు కోటి రూపాయలు కాంట్రాక్టు మనీగా ఇస్తూ వస్తోంది.

అక్టోబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 వరకూ ఈ కాంట్రాక్టు అమలులో ఉంటుంది.

నలుగురికి ఏ+గ్రేడ్ కాంట్రాక్టులు..

కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాలు ఏ+గ్రేడ్ కాంట్రాక్టులు అందుకొన్నారు. ఆస్ట్ర్రేలియాతో ఇటీవలే ముగిసిన బోర్డ్రర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో 22 వికెట్లు పడగొట్టడం ద్వారా సత్తా చాటుకొన్న రవీంద్ర జడేజా తొలిసారిగా ఈ అత్యుత్తమ గ్రేడ్ కు చేరుకోగలిగాడు.

గత సీజన్ వరకూ ఏ-గ్రేడ్ కాంట్రాక్టులో ఉన్న ఓపెనర్ కెఎల్ రాహుల్ ను బీ-గ్రేడ్ కు డిమోట్ చేశారు.

పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, మాజీ కెప్టెన్ అజింక్యా రహానే, మాజీ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మలకు కాంట్రాక్టు దక్కకుండా పోయింది. ఈ ముగ్గురి రిటైర్మెంట్ ఖాయమన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

అక్షర్ పటేల్ కు ఏ-గ్రేడ్ కాంట్రాక్టు...

గత సీజన్ వరకూ బీ-గ్రేడ్ లో ఉన్న అక్షర్ పటేల్ ను ఏ-గ్రేడ్ కాంట్రాక్టుతో బీసీసీఐ వెన్నెుతట్టి ప్రోత్సహించింది. కారుప్రమాదంతో జట్టుకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ను ఏ-గ్రేడ్ కాంట్రాక్టులోనే కొనసాగించనున్నారు.

ఇదే గ్రేడులో చోటు పొందిన ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్, హార్థిక్ పాండ్యా, మహ్మద్ షమీ ఉన్నారు. ఏడాదికి 5 కోట్ల రూపాయల బీ- గ్రేడ్ కాంట్రాక్టులో చతేశ్వర్ పూజారా,కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ నిలిచారు.

11 మందికి కోటి రూపాయల కాంట్రాక్టు..

ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్ తో సహా మొత్తం 11 మంది క్రికెటర్లకు కోటిరూపాయల సీ-గ్రేడ్ కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కింది.

వికెట్ కీపర్లు సంజు శాంసన్, కెఎస్ భరత్ తొలిసారిగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టును దక్కించుకోగలిగారు. ఈ ఇద్దరూ భారతజట్టుకు ఆడినా, ఆడకున్నా కోటిరూపాయలు గ్యారెంటీ మనీగా అందుకోనున్నారు.

First Published:  27 March 2023 5:38 AM GMT
Next Story