Telugu Global
Sports

రంజీట్రోఫీ విజేత సౌరాష్ట్ర, ఫైనల్లో బెంగాల్ చిత్తు!

జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీని సౌరాష్ట్ర రెండోసారి గెలుచుకొంది. ఫైనల్లో బెంగాల్ ను 9 వికెట్లతో బెంగాల్ ను చిత్తు చేసింది.

రంజీట్రోఫీ విజేత సౌరాష్ట్ర, ఫైనల్లో బెంగాల్ చిత్తు!
X

జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీని సౌరాష్ట్ర రెండోసారి గెలుచుకొంది. ఫైనల్లో బెంగాల్ ను 9 వికెట్లతో బెంగాల్ ను చిత్తు చేసింది.

భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా లేకుండానే సౌరాష్ట్ర రంజీట్రోఫీ టైటిల్ గెలుచుకొంది. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐదురోజుల ఫైనల్లో ఆతిథ్య బెంగాల్ ను 9 వికెట్లతో చిత్తు చేసి ట్రోఫీ అందుకొంది.

2019-20 రంజీ సీజన్లో తొలిసారిగా ట్రోఫీ అందుకొన్న సౌరాష్ట్ర్ర ..ఆ తర్వాత మరో టైటిల్ కోసం 2022-23 సీజన్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

బెంగాల్ ఆశలు ఆవిరి....

రంజీ విజేతగా రెండోసారి నిలవాలన్న మాజీ చాంపియన్ బెంగాల్ ఆశలు హోంగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆవిరైపోయాయి. టైటిల్ సమరంలో పవర్ ఫుల్ సౌరాష్ట్ర్రకు సరిజోడీ కాలేకపోయింది.

2012-13 సీజన్లో తొలిసారిగా రంజీ ఫైనల్స్ చేరిన సౌరాష్ట్ర్ర..ఆ తర్వాత ఐదుసార్లు ఫైనల్ చేరినా ..రెండుసార్లు మాత్రమే విజేతగా నిలువగలిగింది.

2019-20 రంజీ ఫైనల్లో సౌరాష్ట్ర్ర చేతిలోనే పరాజయం పొందిన బెంగాల్ బ్యాటింగ్ లో దారుణంగా విఫలమయ్యింది.

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న బెంగాల్ 174 పరుగులకే కుప్పకూలింది. సమాధానంగా సౌరాష్ట్ర్ర 230 పరుగుల భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో ప్రత్యర్థి ఎదుట 404 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

సౌరాష్ట్ర్ర మిడిలార్డర్ బ్యాటర్లు షెల్డన్ జాక్సన్ 59, అర్పిత్ వసవాడ 81, చిరాగ్ జైన్ 60 చక్కగా రాణించారు. రెండో ఇన్నింగ్స్ లో బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.

అంతకుముందు సౌరాష్ట్ర్ర కెప్టెన్ 85 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జయదేవ్ ఉనద్కత్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 22వసారి.

దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న, అత్యుత్తమ జట్టు గా సౌరాష్ట్ర్ర మరోసారి సత్తా చాటుకోగలిగింది.

First Published:  19 Feb 2023 8:30 AM GMT
Next Story