Telugu Global
Sports

ముంబైకి హ్యాట్రిక్ ఓటమి.. అదే కారణమా!

చేజింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ ఫినీష్ చేసింది. రియాన్‌ పరాగ్ (54*; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు.

ముంబైకి హ్యాట్రిక్ ఓటమి.. అదే కారణమా!
X

ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్‌ని ఓటమి కష్టాలు వీడటం లేదు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో హార్దిక్ సేన ఓడిపోయింది. మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇంత వరకు గెలవకపోగా, రాజస్థాన్‌ వరుస విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైని రాజస్థాన్‌ బౌలర్లు బెంబేలెత్తించారు.

ట్రెంట్‌ బౌల్ట్‌ (3/22), యుజ్వేంద్ర చాహల్‌ (3/11), బర్గర్‌ (2/32) ముంబైని చావు దెబ్బతీశారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ముంబై 125 పరుగులే చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (0), నమన్ ధిర్‌ (0), డెవాల్డ్ బ్రెవిస్ (0) గోల్డెన్ డక్ పెట్టారు. వీళ్లు ముగ్గురూ ఎదుర్కున్న తొలి బంతికే పెవిలియన్‌ చేరారు. కాగా వీరి ముగ్గురూ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లోనే ఔటవ్వడం విశేషం.

చేజింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ ఫినీష్ చేసింది. రియాన్‌ పరాగ్ (54*; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. ముంబై వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలోనూ ముంబై విఫలమవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబైకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ లభించడంలేదు. ఫినిషింగ్‌లో హార్దిక్ పాండ్యా తడబడుతున్నాడు, కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నాడు. దీంతో వరుస ఓటములపై అందరి వేల్లు హార్దిక్ వైపే చూపిస్తున్నాయి. 5సార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌శర్మను కాదని.. హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడం వల్లే ముంబైకి ఈ గతి పట్టిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  2 April 2024 2:06 AM GMT
Next Story