Telugu Global
Sports

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో అతిపెద్ద సంచలనం!

2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. టాప్ సీడ్ రాఫెల్ నడాల్ కు అనూహ్య ఓటమి ఎదురయ్యింది.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో అతిపెద్ద సంచలనం!
X

2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. టాప్ సీడ్ రాఫెల్ నడాల్ కు అనూహ్య ఓటమి ఎదురయ్యింది.

2923 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. సీడెడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరుగా ఇంటిదారి పడుతున్నారు.

డిఫెండింగ్ చాంపియన్ గా, టాప్ సీడెడ్ స్టార్ గా టైటిల్ నిలుపుకోడానికి బరిలోకి దిగిన స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ పోటీ రెండోరౌండ్లోనే ముగిసింది.

పరాజయాల ఊబిలో బుల్...

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కు సన్నాహాకంగా ఆడిన 7 వేర్వేరు మ్యాచ్ ల్లో ఆరు పరాజయాలు పొందిన టాప్ సీడ్ నడాల్ ..తొలిరౌండ్ విజయం సాధించినా ..రెండోరౌండ్లో మాత్రం ఓటమి తప్పించుకోలేకపోయాడు.

36 సంవత్సరాల వయసులో గాయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నడాల్ ను ఫిట్ నెస్ సమస్యలతో పాటు వరుస పరాజయాలు మానసికంగా కృంగదీశాయి.

అమెరికా ఆటగాడు మెకంజీ మెక్ డోనాల్డ్ ప్రత్యర్థిగా జరిగిన రెండోరౌండ్ పోరులో నడాల్ 4-6, 4-6, 5-7తో పరాజయం పొంది టోర్నీ నుంచి నిష్క్ర్రమించాడు.

2016 తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ రెండోరౌండ్లోనే పరాజయం పొందటం నడాల్ కు ఇదే మొదటిసారి.

తాను కాలినరం గాయంతోనే ప్రస్తుత టోర్నీలో పాల్గొన్నానని, శారీరకంగా, మానసికంగా కృంగిపోయానని ఓటమి అనంతరం నడాల్ వాపోయాడు. కొద్దిరోజులపాటు టెన్నిస్ కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

తన కెరియర్ లో అత్యధికంగా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మొనగాడు చివరకు ఓటమి భారంతో మెల్బోర్న్ నుంచి స్పెయిన్ దారి పట్టాల్సి వచ్చింది.

First Published:  18 Jan 2023 12:30 PM GMT
Next Story