Telugu Global
Sports

ఆర్జనలో సింధుకు 12వ స్థానం!

తెలుగుతేజం పీవీ సింధు సంపాదన ఏడాదిఏడాదికీ పెరిగిపోతోంది. అత్యధికంగా సంపాదిస్తున్న ప్రపంచ క్రీడాకారిణుల జాబితాలో 12వ స్థానంలో నిలిచింది.

ఆర్జనలో సింధుకు 12వ స్థానం!
X

ఆర్జనలో సింధుకు 12వ స్థానం!

తెలుగుతేజం పీవీ సింధు సంపాదన ఏడాదిఏడాదికీ పెరిగిపోతోంది. అత్యధికంగా సంపాదిస్తున్న ప్రపంచ క్రీడాకారిణుల జాబితాలో 12వ స్థానంలో నిలిచింది...

భారత బ్యాడ్మింటన్ క్వీన్, తెలుగు తేజం పీవీ సింధు ఆటను బాటగా చేసుకొని కోట్లకు కోట్లు సంపాదిస్తూ వస్తోంది. 2016 టోక్యో ఒలింపిక్స్ రజత పతకం, ప్రపంచ టైటిల్ తో సహా ఎన్నో ఘనతలు సాధించిన సింధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సబ్ కలెక్టర్ గా పనిచేస్తోంది.

ఓ వైపు బ్యాడ్మింటన్ ఆడుతూనే వివిధ కంపెనీలకు ప్రచారకర్తగా, రకరకాల ఎండార్స్ మెంట్ల ద్వారా రెండుచేతులా ఆర్జిస్తోంది.

ఫోర్బ్స్ జాబితాలో....

ప్రపంచ క్రీడారంగంలో ప్రతిఏటా అత్యధిక సంపాదన పరుల జాబితాను పోర్బ్స్ సంస్థ ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా ప్రకటించిన క్రీడాకారుల మహిళల టాప్ -25 జాబితాలో

పీవీ సింధు 12వ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్ కోర్టులో సాధించిన విజయాలకు లభించే పారితోషికాలతో పాటు...వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా 71 లక్షల డాలర్ల ఆర్జనతో కొనసాగుతోంది.

జపాన్ టెన్నిస్ సూపర్ స్టార్ నవోమీ ఒసాకా అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్ గా అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఒసాకా టాపర్ గా నిలవడం విశేషం.

మొదటి 10 మంది అత్యధిక సంపాదన పరులైన మహిళల్లో ఏడుగురు టెన్నిస్ ప్లేయర్లే కావడం విశేషం.

సెరెనా విలియమ్స్, ఎమ్మా రాడుకాను, ఇగా స్వయిటెక్, వీనస్ విలియమ్స్, కోకో గాఫ్, జెస్సీకా పెగ్యూలా అత్యధిక ఆర్జనపరులైన మొదటి 10 మంది మహిళా క్రీడాకారిణులుగా నిలిచారు.

50మందిలో ఇద్దరే మహిళలు!

పోర్బ్స్ జాబితాలో నిలిచిన మొదటి 50మంది అత్యధిక ఆర్జన పరుల్లో ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారు. అత్యధిక సంపాదన పరులైన మొదటి 10 మంది మహిళా క్రీడాకారుల్లో నవోమీ ఒసాకా ( 51.1 మిలియన్ డాలర్లు ), సెరెనా విలియమ్స్ ( 41.3 డాలర్లు ), ఇలీన్ గూ ( 20.1 మిలియన్ డాలర్లు ), ఇమ్మా రాడుకానూ ( 18.7 మిలియన్ డాలర్లు ), ఇగా స్వయిటెక్ ( 14.9 మిలియన్ డాలర్లు ), వీనస్ విలియమ్స్ ( 12.1 మిలియన్ డాలర్లు ), కోకో గాఫ్ ( 11.1 మిలియన్ డాలర్లు ). సిమోన్ బైల్స్ ( 10 మిలియన్ డాలర్లు), జెస్సికా పెగ్యూలా (7.6 మిలియన్ డాలర్లు ), మింజీ లీ ( 7.3 మిలియన్ డాలర్లు ) ఉన్నారు.

First Published:  24 Dec 2022 5:44 AM GMT
Next Story