Telugu Global
Sports

నాలుగో టెస్టుకు చీఫ్ గెస్ట్‌గా మోడీ.. ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి మ్యాచ్ వీక్షణ

ఈ స్టేడియం కెపాసిటీ 1,32,000ల సీట్లు. ఈ మ్యాచ్ కు ప్రధాని హాజరుకానుండటంతో రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు.

నాలుగో టెస్టుకు చీఫ్ గెస్ట్‌గా మోడీ.. ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి మ్యాచ్ వీక్షణ
X

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగే ఆఖరి టెస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ కూడా ఈ మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్నారు. బోర్డర్ - గావాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే మూడు మ్యాచులు జరిగాయి. చివరి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తో కలసి ఆయన మ్యాచ్ చూడనున్నారు. భారత్ లోని అతిపెద్ద క్రికెట్ మైదానాల్లో నరేంద్ర మోడీ స్టేడియం కూడా ఒకటి. ఈ స్టేడియం కెపాసిటీ 1,32,000ల సీట్లు. ఈ మ్యాచ్ కు ప్రధాని హాజరుకానుండటంతో రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. నాలుగు టెస్టుల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించగా, మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో నాలుగో టెస్టు ఇరుజట్లకు కీలకంగా మారింది.

ఆఖరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తుండగా, మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి టెస్టు సిరీస్ గెలుచుకోవడం తోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ లో అడుగు పెట్టాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరగా మరో స్థానం కోసం భారత్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై భారత్ విజయం సాధిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఇండియా చేరుకుంటుంది. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది.

First Published:  8 March 2023 4:02 AM GMT
Next Story