Telugu Global
Sports

లక్ష్యసేన్ జోరుకు ప్రణయ్ పగ్గాలు!

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లోనే యువఆటగాడు లక్ష్యసేన్, వెటన్ సైనా నెహ్వాల్ ల పోటీ ముగిసింది.

లక్ష్యసేన్ జోరుకు ప్రణయ్ పగ్గాలు!
X

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లోనే యువఆటగాడు లక్ష్యసేన్, వెటన్ సైనా నెహ్వాల్ ల పోటీ ముగిసింది. భారత సంచలనం హెచ్ఎస్ ప్రణయ్ తుదివరకూ పోరాడి క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టాడు.

టోక్యో వేదికగా జరుగుతున్న 2022 ప్రపంచ బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గాలన్న భారత యువఆటగాడు, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ ఆశ మూడోరౌండ్ ఓటమితో అడియాసగా మిగిలింది.

క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం జరిగిన ప్రీ-క్వార్టర్స్ సమరంలో సీనియర్ ఆటగాడు ప్రణయ్ కు యువఆటగాడు లక్ష్యసేన్ తలవంచక తప్పలేదు.


మూడుగేమ్ ల పోరాటం...

గంటా 15 నిముషాలపాటు నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో 9వ ర్యాంకర్ లక్ష్యసేన్ ను ప్రణయ్ అధిగమించాడు. తొలిగేమ్ ను 21-17తో నెగ్గడం ద్వారా శుభారంభం చేసిన లక్ష్యసేన్ ను కీలక రెండోగేమ్ లో ప్రణయ్ కట్టడి చేశాడు. 21-16తో గేమ్ నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచాడు. నిర్ణయాత్మక ఆఖరి గేమ్ ను ప్రణయ్ 21-17తో నెగ్గడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.

గత ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో కాంస్య పతకం నెగ్గిన లక్ష్యసేన్ ఈసారి మాత్రం ఉత్తచేతులతో స్వదేశానికి తిరిగి రాక తప్పలేదు.

అంతకుముందు రెండోరౌండ్లో రెండోసీడ్, రెండుసార్లు విశ్వవిజేత కెంటో మెమోటోను వరుస సెట్లలో చిత్తు చేసిన ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం తన దేశానికే చేందిన లక్ష్యసేన్ తో తలపడాల్సి వచ్చింది.

సైనా నెహ్వాల్ కు చుక్కెదురు...

మహిళల సింగిల్స్ మూడోరౌండ్లోనే వెటరన్ సైనా నెహ్వాల్ పోటీ ముగిసింది, మొదటి రెండురౌండ్లలో స్థాయికి తగ్గ విజయాలు సాధించిన సైనా...ప్రత్యర్థి ధాయ్ ప్లేయర్

బుసానాన్ ఓమ్ బంగ్ రంగాపాన్ తో తుదివరకూ పోరాడి ఓటమి చవిచూసింది.

32 సంవత్సరాల సైనా తొలిగేమ్ ను 17-21తో చేజార్చుకొన్నా..రెండోగేమ్ ను 21-16తో గెలుచుకోడం ద్వారా సమఉజ్జీగా నిలిచింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్ లో సైనా 13-21తో చతికిల పడిపోయింది. బుసానాన్ ప్రత్యర్థిగా సైనాకు 5వ ఓటమి.

డబుల్స్ లో భారత్ జోరు..

పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారతజట్లు ధృవ్- అర్జున్, సాత్విక్- షిరాగ్ చేరుకొన్నారు. తమతమ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో భారత డబుల్స్ జట్లు స్థాయికి మించి ఆడి విజయాలు నమోదు చేశాయి.

క్వార్టర్ ఫైనల్లో జపాన్ కు చెందిన రెండోసీడ్ జోడీ టకురో- కోబియాషీలతో సాత్విక్-చిరాగ్ జోడీ తలపడాల్సి ఉంది.

First Published:  25 Aug 2022 1:35 PM GMT
Next Story