Telugu Global
Sports

ఫ్రెంచ్ ఓపెన్లో పోలిష్ క్వీన్ తీన్మార్!

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను పోలిష్ సంచలనం ఇగా స్వియటెక్ మూడోసారి నెగ్గి హ్యాట్రిక్ నమోదు చేసింది...

ఫ్రెంచ్ ఓపెన్లో పోలిష్ క్వీన్ తీన్మార్!
X

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను పోలిష్ సంచలనం ఇగా స్వియటెక్ మూడోసారి నెగ్గి హ్యాట్రిక్ నమోదు చేసింది...

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను వరుసగా మూడుసార్లు నెగ్గిన క్రీడాకారిణిగా ప్రపంచ నంబర్ వన్, పోలెండ్ సంచలనం ఇగా స్వియటెక్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

గతంలో 2020, 2022 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన స్వియటెక్ ప్రస్తుత 2023 టోర్నీలో సైతం విజేతగా నిలిచింది. పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంట్ర్లల్ స్టేడియం వేదికగా జరిగిన టైటిల్ సమరంలో ప్రపంచ నంబర్ వన్ స్వియటెక్ మూడుసెట్ల పోరులో చెక్ రిపబ్లిక్ ప్లేయర్, 43వ ర్యాంకర్ కారోలిన మచోవాను అధిగమించింది.

ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీతో పాటు 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సైతం సొంతం చేసుకొంది.

హేమాహేమీల సరసన స్వియెటెక్...

ప్రెంచ్ ఓపెన్ టైటిల్ ను మూడోసారి నెగ్గడం ద్వారా మరో ఇద్దరు దిగ్గజాల సరసన స్వియటెక్ నిలిచింది. 22 సంవత్సరాల వయసుకే నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన పోలిష్ తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది.

హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో స్వియటెక్ 6-2, 5-7, 6-4తో విజేతగా నిలిచింది. తొలిసెట్ ను 6-2తో అలవోకగా నెగ్గిన స్వియటెక్ రెండోసెట్ ను 5-7తో చేజార్చుకొంది.

నిర్ణయాత్మక ఆఖరి సెట్ ను 6-4తో కైవసం చేసుకోడం ద్వారా విజేతగా నిలిచింది.

ఫ్రెంచ్ ఓపెన్..ఓపెన్ ఎరాలో 2007 తర్వాత టైటిల్ ను నిలుపుకొన్న తొలి క్రీడాకారిణిగా స్వియటెక్ నిలిచింది. 1990 దశకంలో మోనికా సెలెస్, నవోమీ కాంప్ బెల్ మూడేసిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన వారిలో ఉన్నారు.

16 సంవత్సరాల క్రితం జస్టిన్ హెనిన్ వరుసగా రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన తరువాత ..అదే ఘనతను సాధించిన ప్లేయర్ గా స్వియటెక్ రికార్డుల్లో చేరింది.

అత్యంత పిన్నవయసులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను మూడుసార్లు సాధించడంతో పాటు వరుసగా రెండుసార్లు గెలుచుకొన్న మహిళగా స్వియటెక్ చరిత్ర సృష్టించింది.

గత ఐదు ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలలో స్వియటెక్ 28 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఉంది.

19 సంవత్సరాల వయసులో 54వ ర్యాంకర్ గా ఉన్న స్వియటెక్ తన తొలిగ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందుకోగలిగింది. 26 సంవత్సరాల కారోలినా మచోవా మాత్రం తన తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ టైటిల్ సమరంలో 3వ సీడ్ నొవాక్ జోకోవిచ్ కు 4వ సీడ్ కాస్పర్ రూడ్ సవాలు విసురుతున్నాడు.

First Published:  11 Jun 2023 7:05 AM GMT
Next Story