Telugu Global
Sports

సాకర్ శిఖరం పీలే ఇక లేరు!

ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు, బ్రెజిల్ ఆణిముత్యం పీలే తమ 82వ ఏట కన్నుమూశారు. వయోభారానికి తోడు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు...

సాకర్ శిఖరం పీలే ఇక లేరు!
X

ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు, బ్రెజిల్ ఆణిముత్యం పీలే తమ 82వ ఏట కన్నుమూశారు. వయోభారానికి తోడు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు...

ఫుట్ బాల్ చరిత్రలో బ్రెజిల్ ఆణిముత్యం పీలే శకం ముగిసింది. 1959- 1974 మధ్యకాలంలో ప్రపంచ ఫుట్ బాల్ ను తన ఆటతీరుతో ఉర్రూతలూగించిన పీలే 82 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కన్నుమూశారు.

మూడు ప్రపంచకప్ ల మొనగాడు...

ఫుట్ బాల్ కే తనపేరును చిరునామాగా చేసుకొన్న పీలే కేవలం తన ప్రతిభతోనే బ్రెజిల్ ను మూడుసార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిపారు. బ్రెజిల్ ఇప్పటి వరకూ సాధించిన ఐదువేర్వేరు ప్రపంచకప్ టోర్నీ విజయాలలో పీలే అందించినవే మూడు ట్రోఫీలు ఉన్నాయి.

కళ్లు చెదిరే డ్రిబ్లింగ్ కు మెరుపువేగంతో గోల్స్ సాధించే నైపుణ్యాన్ని జోడించి ఫుట్ బాల్ ఆటనే కొత్తపుంతలు తొక్కించారు. 1959లో మొదలైన పీలే జైత్రయాత్ర 1974 వరకూఅప్రతిహతంగా కొనసాగింది. 18 సంవత్సరాల వయసులోనే ప్రపంచకప్ ట్రోఫీ అందుకోడంతో పాటు ఆరు గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

బైసికిల్ కిక్ షాట్ కు ఆద్యుడిగా నిలిచారు.

16 సంవత్సరాల చిరుప్రాయంలోనే...

16 సంవత్సరాల లేలేత వయసులోనే తన ఫుట్ బాల్ కెరియర్ ను ప్రారంభించిన పీలే 1958, 1962, 1970 సంవత్సరాలలో బ్రెజిల్ కు ప్రపంచ ఫుట్ బాల్ టైటిల్ ను బ్రెజిల్ కు అందించారు. తన సుదీర్ఘ కెరియర్ లో మొత్తం 92 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడి 77 గోల్స్ సాధించారు.

1956 నుంచి 1974 వరకూ బ్రెజిల్ క్లబ్ కు శాంటోస్ తరపున లీగ్ సాకర్ఆడుతూ 659 మ్యాచ్ ల్లో 643 గోల్స్ సాధించారు. తన పుట్ బాల్ జీవితంలోనే ఆఖరి రెండుసంవత్సరాలు అమెరికాలోని న్యూయార్క్ కాస్మోస్ తరపున ఆడారు.

బ్రెజిల్ లీగ్ ( కాంపెనాటో బ్రసెలేరియా సీరీ ఏ)టైటిల్ ను 1961,1962, 1963, 1964, 1965స 1968 సంవత్సరాలలో తన క్లబ్ కు అందించారు. దక్షిణ అమెరికా సాకర్ టైటిల్ కోపా లిబ్రేటాడోర్స్ టైటిల్ ను 1962, 1963 సంవత్సరాలలో బ్రెజిల్ కు సంపాదించి పెట్టారు.

1959 నుంచి 1974 వరకూ పీలే స్వర్ణయుగంగా కొనసాగింది.

కోలన్ క్యాన్సర్ తో పోరాడుతూ...

వ్యక్తిగతంగా పీలే మూడుసార్లు వివాహం చేసుకొన్నారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఓ కుమార్డు. మాదకద్రవ్యాల కేసులో తన కుమారుడు అరెస్టు కావడంతో పీలే పలురకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు.

రెండేళ్లక్రితం ఆయనకు కోలన్ క్యాన్సర్ అని డాక్టర్లు నిర్దారించి చికిత్స అందచేస్తున్నారు. 82 సంవత్సరాల వయసులో సైతం సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించే పీలే

చివరకు శ్వాససంబంధ వ్యాధులతో ఆస్పత్రిలో చేరి మృతి చెందారు.

అర్జెంటీనా దిగ్గజం డియాగో మారడోనాతో కలసి పీలే ఫీఫా ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ పురస్కారాన్ని అందుకొన్నారు. పీలే మృతితో ప్రపంచ ఫుట్ బాల్ ఓ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ ను కోల్పోయినట్లయ్యింది.

First Published:  30 Dec 2022 3:24 AM GMT
Next Story