Telugu Global
Sports

ప్రపంచకప్ ఫైనల్లో పాక్, సెమీస్ లో తేలిపోయిన కివీస్!

Pakistan in the World Cup final: టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ పాకిస్థాన్ చేరుకొంది. సిడ్నీ వేదికగా ముగిసిన తొలిసెమీఫైనల్లో గతేడాది రన్నరప్ న్యూజిలాండ్ ను పాక్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ప్రపంచకప్ ఫైనల్లో పాక్, సెమీస్ లో తేలిపోయిన కివీస్!
X

టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ పాకిస్థాన్ చేరుకొంది. సిడ్నీ వేదికగా ముగిసిన తొలిసెమీఫైనల్లో గతేడాది రన్నరప్ న్యూజిలాండ్ ను పాక్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది...

ప్రపంచ మాజీ చాంపియన్, 4వ ర్యాంకర్ పాకిస్థాన్ ప్రపంచకప్ ఫైనల్స్ కు మూడోసారి చేరుకొంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ముగిసిన ఏకపక్ష తొలిసెమీఫైనల్స్ లో గత ఏడాది రన్నరప్ న్యూజిలాండ్ ను 7 వికెట్లతో చిత్తు చేసింది. మహ్మద్ రిజ్వాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ నాకౌట్ సమరంలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా 153 పరుగుల స్వల్పలక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాక్ జట్టుకు ఓపెనింగ్ జోడీ బాబర్ అజమ్- మహ్మద్ రిజ్వాన్ సెంచరీభాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. చివరకు పాక్ జట్టు ఓపెనర్ల వికెట్ నష్టానికే విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది. రిజ్వాన్ 57, బాబర్ 53, మహ్మద్ హారిస్ 30 పరుగులకు అవుటయ్యారు.

షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్ నాటౌట్ గానిలిచి తమజట్టు ఆఖరి ఓవర్ విజయం అందించారు.

రిజ్వాన్ 43 బాల్స్ లో 5 బౌండ్రీలతో 57 పరుగులు, బాబర్ అజామ్ 42 బాల్స్ లో 7 బౌండ్రీలతో 53 పరుగులు సాధించారు. ప్రస్తుత ప్రపంచకప్ లో పాక్ ఓపెనింగ్ జోడీకి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

1992లో అలా...2022లో ఇలా...

ఆస్ట్ర్రేలియా వేదికగా 1992లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో సీనే మరోసారి పునరావృతమయ్యింది. బెన్సన్ హెడ్జెస్ ప్రపంచకప్ టోర్నీలో దొడ్డిదారిన సెమీస్ కు అర్హత సంపాదించిన పాక్ జట్టు...అప్పటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను కంగు తినిపించడం ద్వారా ఏకంగా టైటేలే ఎగరేసుకుపోయింది.

ప్రస్తుత 2022 ప్రపంచకప్ లో సైతం ..నెదర్లాండ్స్ పుణ్యమా అంటూ సెమీస్ బెర్త్ సాధించిన పాక్ జట్టు సెమీఫైనల్లో అదే న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా మరోసారి టైటిల్ కు గురిపెట్టింది.

కివీస్ పై తిరుగులేని పాక్...

న్యూజిలాండ్ ప్రత్యర్థిగా టీ-20 మ్యాచ్ ల్లో పాక్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకొంది. గత 29 మ్యాచ్ ల్లో 18వ విజయం నమోదు చేసింది.న్యూజిలాండ్ పై 18-11 రికార్డుతో ఆధిపత్యం చాటుకొంది.

భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో నెగ్గిన జట్టుతో...ఈ నెల 13న మెల్బోర్న్ వేదికగా జరిగే టైటిల్ సమరంలో పాక్ జట్టు తలపడనుంది.

First Published:  9 Nov 2022 11:59 AM GMT
Next Story