Telugu Global
Sports

బంగ్లాదేశ్ బోల్తా...ప్రపంచకప్ సెమీస్ లో పాక్!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ఏదైనా సాధ్యమేనని మరోసారి తేలింది. వరుస పరాజయాలతో ఢీలాపడిన పాకిస్థాన్ హ్యాట్రిక్ విజయాలతో ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. బంగ్లాదేశ్ తో ముగిసిన డూ ఆర్ డై ఫైట్ లో 5 వికెట్ల విజయం సాధించింది.

బంగ్లాదేశ్ బోల్తా...ప్రపంచకప్ సెమీస్ లో పాక్!
X

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ఏదైనా సాధ్యమేనని మరోసారి తేలింది. వరుస పరాజయాలతో ఢీలాపడిన పాకిస్థాన్ హ్యాట్రిక్ విజయాలతో ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. బంగ్లాదేశ్ తో ముగిసిన డూ ఆర్ డై ఫైట్ లో 5 వికెట్ల విజయం సాధించింది...

కంగారూల్యాండ్ వేదికగా జరుగుతున్న 2022 టీ-20 ప్రపంచకప్ సెమీస్ లైనప్ పలు సంచలనాలతో పూర్తయ్యింది.ఈరోజు జరిగిన సూపర్ -12 ఆఖరిరౌండ్ మ్యాచ్ ల్లో

నెదర్లాండ్స్ చేతిలో ఓడి దక్షిణాఫ్రికా సెమీస్ రేస్ నుంచి నిష్క్ర్రమిస్తే..బంగ్లాదేశ్ ను చిత్తు చేయడం ద్వారా పాకిస్థాన్ నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

దీంతో...గ్రూపు -1 నుంచి గతేడాది రన్నరప్ న్యూజిలాండ్, మాజీ చాంపియన్ ఇంగ్లండ్, గ్రూప్ - 2 నుంచి ఆసియాదిగ్గజాలు భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్స్ చేరినట్లయ్యింది.

సెమీస్ చాన్స్ చేజారిన బంగ్లాదేశ్...

అడిలైడ్ ఓవల్ వేదికగా ఈరోజు ముగిసిన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై నెగ్గితీరాల్సిన బంగ్లాదేశ్ తేలిపోయింది. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా

బ్యాటింగ్ ఎంచుకొన్న బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్ శాంటో 54, వన్ డౌన్ సౌమ్య సర్కార్ 20, మిడిలార్డర్ ఆటగాడు అఫిఫ్ హుస్సేన్ 24 మినహా మిగిలిన ప్రధానబ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ 22 పరుగులిచ్చి 4 వికెట్లు, లెగ్ స్పిన్నర్ షదాబ్ ఖాన్ 2 వికెట్లు, హారిస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

పాక్ ను ఆదుకొన్న రిజ్వాన్, హారిస్...

మ్యాచ్ నెగ్గడం ద్వారా సెమీస్ చేరాలంటే 128 పరుగుల స్వల్పలక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాక్ జట్టుకు ఓపెనింగ్ జోడీ బాబర్ అజమ్- మహ్మద్ రిజ్వాన్ మొదటి వికెట్ కు

57 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయినా రెండోడౌన్ మహ్మద్ హారిస్ కుదురైన బ్యాటింగ్ తో జట్టుకు అండగా నిలిచాడు.

బాబర్ అజమ్ 25, రిజ్వాన్ 32, షాన్ మసూద్ 24 పరుగులకు అవుట్ కాగా...హారిస్ 31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పాకిస్థాన్ 18.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికే గమ్యం చేరుకోగలిగింది.

సూపర్ -12 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టాల్సిన పాక్ జట్టు అనూహ్యంగా పుంజుకొని నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మీద విజయాలు సాధించడం ద్వారా గ్రూప్ -2 రన్నరప్ గా సెమీస్ లో అడుగుపెట్టింది.

పాక్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెమీఫైనల్లో గ్రూప్ -1 విన్నర్ న్యూజిలాండ్ తో పాక్ జట్టు తలపడాల్సి ఉంది.

First Published:  6 Nov 2022 8:52 AM GMT
Next Story