Telugu Global
Sports

ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై పాక్ క్రికెట్ జట్టు!

భారత్ వేదికగా అక్టోబర్ 5న ప్రారంభం కానున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనటానికి ప్రపంచ రెండోర్యాంక్ జట్టు పాకిస్థాన్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది.

ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై పాక్ క్రికెట్ జట్టు!
X

ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై పాక్ క్రికెట్ జట్టు!

భారత్ వేదికగా అక్టోబర్ 5న ప్రారంభం కానున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనటానికి ప్రపంచ రెండోర్యాంక్ జట్టు పాకిస్థాన్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది.

భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నా..క్రీడాసంబంధాలు మాత్రం అంటీముట్టనట్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. క్రికెట్ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.

భారతజట్టు పాకిస్థాన్ పర్యటనలకు, పాక్ జట్టు భారత పర్యటనలకు వెళ్ళటం గత కొద్ది సంవత్సరాలుగా నిలిపివేశాయి.

అయితే..భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంటి నవంబర్ 19 వరకూ జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనటానికి పాక్ జట్టుకు భారత ప్రభుత్వం తర్జనభర్జనల అనంతరం వీసాలను మంజూరు చేసింది.

48గంటల ముందే పాక్ క్రికెటర్లకు వీసాలు..

ప్రపంచ టాప్ ర్యాంక్ బ్యాటర్ బాబర్ అజమ్ నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు 7 సంవత్సరాల విరామం తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టింది. లాహోర్ నుంచి దుబాయ్ మీదుగా మన హైదరాబాద్ నగరానికి చేరుకొంది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ నెల 29న న్యూజిలాండ్ తో జరిగే ప్రాక్టీసు మ్యాచ్ లో పాకిస్థాన్ పోటీపడనుంది.

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా పాక్ జట్టు తన తొలిమ్యాచ్ ను అక్టోబర్ 3న ఆస్ట్ర్రేలియాతో ఆడాల్సి ఉంది. శ్రీలంకతో అక్టోబర్ 10న రెండోమ్యాచ్ లో తలపడనుంది.

ప్రపంచకప్ లో పాల్గొనటానికి 48 గంటల ముందు మాత్రమే పాక్ క్రికెటర్లకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేసింది.

ప్రస్తుత పాక్ జట్టులోని మహ్మద్ నవాజ్, సల్మాన్ అలీ అగాలకు మాత్రమే గతంలో భారత్ లో పర్యటించిన అనుభవం ఉంది. జట్టులోని మిగిలిన ఆటగాళ్లందరూ తొలిసారిగా భారత్ లో అడుగుపెట్టారు.

పాక్ జట్టుకు పటిష్టమైన భద్రత...

ప్రపంచకప్ లో పాల్గొనటానికి వచ్చిన పాక్ క్రికెటర్లకు పటిష్టమైన భద్రతను భారత ప్రభుత్వం కల్పించింది. భారత గడ్డపై తమకు వచ్చిన ముప్పేమీలేదని, మిగిలినజట్లు మాదిరిగానే తమజట్టుకు సైతం భారత ప్రభుత్వం అత్యుత్తమస్థాయి భద్రత కల్పించడం పట్ల పాక్ టీమ్ మేనేజ్ మెంట్ ప్రతినిధి జకా అష్రాఫ్ సంతోషం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మాత్రం తొలిసారిగా భారత్ కు రావడం తనకు ఏదో తెలియని అనుభూతిని కలిగించిందని, అత్యుత్తమంగా రాణించడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే పోరులో భారత్- పాక్ జట్లు తలపడనున్నాయి. లక్షమంది అభిమానులతో నిండిన స్టేడియంలో భారత్ ప్రత్యర్థిగా మ్యాచ్ ఆడటానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమని, ఉత్కంఠతో ఎదురుచూస్తున్నామని బాబర్ తెలిపాడు.

First Published:  28 Sep 2023 4:15 AM GMT
Next Story