Telugu Global
Sports

హాకీ ప్రపంచకప్ లో భారత్ కు న్యూజిలాండ్ షాక్!

హాకీ ప్రపంచకప్ ను 48 సంవత్సరాల తర్వాత తిరిగి గెలుచుకోవాలన్న భారత ఆశలు అడియాసలయ్యాయి.

హాకీ ప్రపంచకప్ లో భారత్ కు న్యూజిలాండ్ షాక్!
X

హాకీ ప్రపంచకప్ ను 48 సంవత్సరాల తర్వాత తిరిగి గెలుచుకోవాలన్న భారత ఆశలు అడియాసలయ్యాయి. భారత్ పై న్యూజిలాండ్ పెనాల్టీ షూటౌట్లో సంచలన విజయం సాధించింది...

2023 ప్రపంచకప్ లో భారత్ టైటిల్ వేట ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం న్యూజిలాండ్ తో జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్ లో అనూహ్య పరాజయం చవిచూసింది.

9 నుంచి 16 స్థానాల కోసం మరో రెండుమ్యాచ్ ల్లో మాత్రమే పోటీపడాల్సి ఉంది.

కొంపముంచిన పెనాల్టీకార్నర్లు...

పెనాల్టీ కార్నర్లను గోల్సు గా మలచుకోడంలో చేతకాని తనం భారత్ ను నిలువునా ముంచింది. డార్క్ హార్స్ న్యూజిలాండ్ తో జరిగి కీలక సమరంలో భారత్ కు మొత్తం 11 పెనాల్టీ కార్నర్లు దక్కితే..రెండుగోల్స్ మాత్రమే సాధించగలిగింది. డ్రాగ్ ఫిక్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ దారుణంగా విఫలం కావడం భారత్ అవకాశాలను దెబ్బతీశాయి.

భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆట నిర్ణితసమయంలో భారత్ పైచేయి సాధిస్తూ వచ్చిన చివరి క్షణం వరకూ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయింది.

3-3 గోల్స్ తో మ్యాచ్ డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూటౌట్ సడన్ డెత్ విధానం పాటించారు. ఇందులో న్యూజిలాండ్ 5-4 గోల్స్ తో విజేతగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఆట నిర్ణితసమయంలో లలిత్‌ ఉపాధ్యాయ్‌ 17వ నిమిషంలో, సుఖ్‌జీత్‌ సింగ్‌ 24వ , వరుణ్‌ కుమార్‌ 40వ నిముషంలో భారత్ కు గోల్స్ అందించారు.

న్యూజిలాండ్ తరపున 28వ నిముషంలో సామ్‌ లేన్‌ , 43వ నిముషంలో కెన్‌ రస్సెల్‌ , 49వ నిముషంలో సీన్‌ ఫిన్లే గోల్స్ సాధించడం ద్వారా తమజట్టును సమఉజ్జీగా నిలుపగలిగారు.

తొలి అర్ధభాగంలో ఫుల్‌ జోష్‌లో కనిపించిన భారత్‌ ఒక దశలో 2-0తో తిరుగులేని ఆధిక్యం కొనసాగించినా.. చివరకు ఒత్తిడికి గురై ప్రత్యర్థికి రెండు పెనాల్టీ కార్నర్‌లను ప్రత్యర్థికి సమర్పించుకొంది.

శ్రీజేష్ కు గాయం, భారత్ కు శాపం..

పెనాల్టీ షూటౌట్లో భారత గోల్ కీపర్ శ్రీజేష్ అసాధారణ ప్రతిభతో మూడు పెనాల్టీలను అడ్డుకొన్నా గాయంతో జట్టుకు అందుబాటులో లేకపోడం దెబ్బతీసింది.

పెనాల్టీ షూటౌట్లో భారత్ తరపున హర్మన్ ప్రీత్ సింగ్, పాల్ రాజ్, సుఖ్ జీత్ సింగ్ గోల్స్ సాధించగా ..షంషేర్ సింగ్ విఫలమయ్యాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో

వుడ్స్ నిక్, ఫిన్లే సీన్, ఫిలిప్స్, సామ్ లేన్,ఫిలిప్స్ తమ తమ పెనాల్టీలను గోల్సు గా మలచగలిగారు.

మెడల్ రౌండ్ నుంచి నిష్క్ర్రమించిన భారత్ ఇక..9 నుంచి 16 స్థానాల కోసం పోటీపడాల్సి ఉంది.విజయంతో క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగింది. క్వార్టర్ ఫైనల్స్ చేరిన

ఎనిమిది జట్లలో ఆస్ట్ర్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఇంగ్లండ్,స్పెయిన్, న్యూజిలాండ్, అర్జెంటీనా ఉన్నాయి.

First Published:  23 Jan 2023 4:42 AM GMT
Next Story