Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ లో ముంబై టాప్ గేర్!

ప్రారంభ మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. విజయాల హ్యాట్రిక్ తో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

మహిళా ఐపీఎల్ లో ముంబై టాప్ గేర్!
X

మహిళా ఐపీఎల్ లో ముంబై టాప్ గేర్!

ప్రారంభ మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. విజయాల హ్యాట్రిక్ తో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది...

ముంబై వేదికగా జరుగుతున్న 2023 మహిళా ఐపీఎల్ లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా మూడో విజయంతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ మూడోరౌండ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ను 8 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా వరుసగా మూడో విజయంతో అగ్రస్థానంలో నిలిచింది. మూడుకు మూడురౌండ్లు నెగ్గిన తొలిజట్టుగా నిలిచింది.

105 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ...

అంతర్జాతీయ ప్లేయర్ మెగ్ లానింగ్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాక్ టు బ్యాక్ విజయాలకు మంబై బ్రేక్ వేసింది. డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన

లీగ్ 7వ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కమ్ కెప్టెన్ మెగ్ లానింగ్ 43, మిడిలార్డర్ ప్లేయర్ జెమీమా రోడ్రిగేజ్ 25, లోయర్ ఆర్డర్ బ్యాటర్ రాధా యాదవ్ 10 మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.

చివరకు 18 ఓవర్లలోనే 105 పరుగులకే ఢిల్లీ ఇన్నింగ్స్ కు తెరపడింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్, వాంగ్ 3, హేలీ మాథ్యూస్ 3 వికెట్లు చొప్పున పడగొట్టారు.

2 వికెట్లకే గమ్యం చేరిన ముంబై...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలోనే 106 పరుగులు చేయాల్సిన ముంబై కి ఓపెనింగ్ జోడీ యాస్టికా భాటియా- హేలీ మాథ్యూస్ అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 8.5 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యంతో గట్టిపునాది వేశారు.

యాస్టికా 32 బంతుల్లో 8 బౌండ్రీలతో 41, హేలీ మాథ్యూస్ 31 బంతుల్లో 6 బౌండ్రీలతో 32 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు. వన్ డౌన్

నాట్ స్కీవయర్ 23, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 11 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలవడంతో ముంబై 15 ఓవర్లలో 2 వికెట్లకు 109 పరుగులతో 8 వికెట్ల విజయం సాధించింది.

ముంబై విజయంలో ప్రధానపాత్ర వహించిన సైకా ఇషాఖ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 20 మ్యాచ్ ల లీగ్ లో ఇప్పటి వరకూ మూడురౌండ్ల మ్యాచ్ లు ఆడిన ముంబైకి ఇది వరుసగా మూడో విజయం కాగా..ఢిల్లీకి రెండు విజయాల తరువాత తొలి ఓటమి.

లీగ్‌లో భాగంగా ఈరోజు జరిగే మ్యాచ్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో యూపీ వారియర్స్‌ తలపడనుంది. రాత్రి 7-30 గంటలకు ముంబై బ్రబోర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

First Published:  10 March 2023 5:25 AM GMT
Next Story