Telugu Global
Sports

వరుసగా నాలుగో గెలుపుతో ముంబై మస్త్ మస్త్!

మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. నాలుగోరౌండ్ పోరులో యూపీ వారియర్స్ పై 8 వికెట్ల విజయంతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

వరుసగా నాలుగో గెలుపుతో ముంబై మస్త్ మస్త్!
X

మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. నాలుగోరౌండ్ పోరులో యూపీ వారియర్స్ పై 8 వికెట్ల విజయంతో టేబుల్ టాపర్ గా నిలిచింది.....

భారత క్రికెట్ బోర్డు మహిళల కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రారంభ ఐపీఎల్.. ఐదుజట్ల లీగ్ లో ముంబై ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయంతో లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది.

హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ....

ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ నాలుగోరౌండ్ సమరంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కెప్టెన్ అలీసా హేలీ 58, తహిల్యా మెక్ గ్రాత్ 50 పరుగుల స్కోర్లతో హాఫ్ సెంచరీలు సాధించడంతో ..యూపీ ఒకదశలో 17వ ఓవర్ ముగిసే నాటికి 3 వికెట్ల నష్టానికి 140 పరుగులతో పటిష్టంగా కనిపించింది. 170కి పైగా పరుగులు సాధించగలదనుకొన్న యూపీకి ముంబై బౌలర్లు..ఆఖరి మూడు ఓవర్లలో పగ్గాలు వేయగలిగారు.

యూపీ కెప్టెన్‌ అలీసా హీలీ హాఫ్ సెంచరీలో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. తహిల్యా మెక్ గ్రాత్ 9 బౌండ్రీలతో 50 పరుగుల స్కోరు సాధించారు.

ముంబై బౌలర్లలో సైకా ఇషాకు 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా యూపీని సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది.

17.3 ఓవర్లలోనే ముంబై షో.....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 160 పరుగులు చేయాల్సిన ముంబై కేవలం 17.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి విజేతగా నిలువగలిగింది. ఓపెనర్ యస్తిక భాటియా 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 42 పరుగుల స్కోరుతో ముంబైకి మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ 12 పరుగులకే అవుటైనా..మొదటి వికెట్ కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం అందించగలిగింది.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 33 బంతులు ఎదుర్కొని 9 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 53 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచింది. మరో బ్యాటర్ స్కీవర్ బ్రంట్ 6 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 45 పరుగులు చేయడం ద్వారా విజయంలో తనవంతు పాత్ర నిర్వర్తించింది.

అజేయ అర్ధశతకంతో రాణించిన ముంబై కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ముంబై 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. యూపీ లెఫ్టామ్ స్పిన్నర్ సోఫి ఇకెల్ స్టెన్, స్కీవర్ బ్రంట్ చెరో వికెట్ పడగొ్ట్టార్రు.

ఒకే ఒక్కజట్టు ముంబై...

ఐదుజట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి నాలుగురౌండ్లలో మొత్తం నాలుగు ప్రత్యర్థిజట్లను ( బెంగళూరు, అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ ) ఓడించిన ఏకైకజట్టుగా ముంబై అవతరించింది.

ముంబై బౌలర్ సైకా ఇషాకు ఇప్పటి వరకూ ఆడిన నాలుగుమ్యాచ్ ల్లో 12 వికెట్లు పడగొట్టడం ద్వారా బౌలర్ నంబర్ వన్ గా నిలిచింది. ఈరోజు జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

తొలి అంచెలో ఆడిన నాలుగుకు నాలుగుమ్యాచ్ ల్లో నెగ్గిన జట్టుగా ముంబై, ఓడిన జట్టుగా బెంగళూరు నిలిచాయి.

First Published:  13 March 2023 6:05 AM GMT
Next Story